జాతీయ జెండాను చింపిన పాకీలు.. ధైర్యంగా అడ్డుకున్న భారత విలేకరి!

0
0


లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాకిస్థానీలు రెచ్చిపోయారు. పెద్ద పాక్, కశ్మీర్ జెండాలతో చేరుకున్న ఆందోళనకారులు ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అంతేగాక, భారత జాతీయ జెండాను కాళ్లతో తొక్కుతూ.. చించేందుకు ప్రయత్నించారు.

ఇంతకు ముందు ఓ పాకిస్తాన్ వ్యక్తి భారతీయులతో కలిసి నిలుచున్నాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి నుంచి భారత జెండాను లాక్కొని పాక్ ఆందోళనకారులకు ఇచ్చాడు. దీంతో దాన్ని వారు కిందపడేసి తొక్కతుండుగా.. అక్కడే ఉన్న ఏఎన్ఐ మహిళా జర్నలిస్ట్ పూనమ్ జోషి వారి చేతుల నుంచి ఆ జెండాను లాగేసుకుంది. ఆమె చేసిన పనికి భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.

‘‘వారు జాతీయ జెండాను రెండుగా చిల్చేశారు. ఆ సమయానికి నేను పోలీసుల భద్రతా వలయానికి బయట నిలుచుని ఉన్నాను. దీంతో పరుగు పరుగున అక్కడికి చేరుకుని రోడ్డుపై పడివున్న జెండా భాగాన్ని తీసుకున్నాను. ఆందోళనకారుడి చేతిలో ఉన్న జెండా భాగాన్ని లాక్కున్నాను’’ అని పూనమ్ తెలిపింది. ఈ ఘటనలో పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here