జాతీయ స్థాయికి క్రీడాకారుల ఎంపిక

0
0


జాతీయ స్థాయికి క్రీడాకారుల ఎంపిక

కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి అండర్‌-17 బాలికల హాకీ జాతీయ జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. తెలంగాణలోని పాత పది జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల్లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన 18 మందిని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా నుంచి అశ్విని, రక్షిత, శిరీష, శివనందిని, నిజామాబాద్‌ నుంచి విట్టబాయి, సుజాత, హసినిప్రియ, నవిత, మహబూబ్‌నగర్‌ నుంచి గంగోత్రి, మౌనిక, ఆదిలాబాద్‌ నుంచి రుచితరెడ్డి, ఉమ, వరంగల్‌ నుంచి అనూష, కరీంనగర్‌ నుంచి శైలజ, ఖమ్మం నుంచి సుష్మిత, నల్గొండ నుంచి పావని, హైదరాబాద్‌ నుంచి కావేరి, మెదక్‌ నుంచి మేఘన ఎంపికయ్యారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here