జాతీయ స్థాయిలో రాణించాలి

0
2


జాతీయ స్థాయిలో రాణించాలి

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని ఆర్మూర్‌ ఎంపీపీ పస్క నర్సయ్య సూచించారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ సీనియర్‌ మహిళా జట్టు శిక్షణా శిబిరం ముగిసింది. ప్రతిభ చాటిన క్రీడాకారిణులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొని మాట్లాడారు. ఆటలతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ఎంపికైన వారు నవంబరు 1 నుంచి 5 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోపిబాబు, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రధానాచార్యురాలు పుష్పాంజలి, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగామోహన్‌, శిక్షకులు సాయి, లవుడు, సౌజన్య పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైన వారు వీరే:

మమత(నిజామాబాద్‌), ఇందు(నిజామాబాద్‌), పూజ(మెదక్‌), వంశిక(నిజామాబాద్‌), వైష్ణవి(మెదక్‌), భులాబాయి(నిజామాబాద్‌), సంయుక్త(హైదరాబాద్‌), శివాణి(కరీంనగర్‌), సంస్కృతి(హైదరాబాద్‌), జి.మమత(మహబూబ్‌నగర్‌), హేమబాయి(హైదరాబాద్‌), శృతి(నిజామాబాద్‌), మౌనిక(మేడ్చల్‌), నిశిత(మెదక్‌), రేచల్‌(రంగారెడ్డి), దివ్యరాణి(మహబూబ్‌నగర్‌), రచన(ఆదిలాబాద్‌), నిహారిక(వరంగల్‌).Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here