జియో ఆఫర్: థియేటర్లో సినిమా విడుదలైన రోజే ఇంట్లో చూడొచ్చు, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌కు దెబ్బ

0
0


జియో ఆఫర్: థియేటర్లో సినిమా విడుదలైన రోజే ఇంట్లో చూడొచ్చు, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌కు దెబ్బ

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముఖేష్ అంబానీ సోమవారం (ఆగస్ట్ 12) కీలక ప్రకటనలు చేశారు. 42వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM)సందర్భంగా ఆయన ప్రసంగించారు. రిలయన్స్ గిగా ఫైబర్ సేవలను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో మరో సంచలన ప్రకటన చేశారు.

థియేటర్లో సినిమా విడుదలైన రోజే మీ ఇంట్లో చూడొచ్చు

రిలయన్స్ జియో గిగా ఫైబర్ ప్రీమియం కస్టమర్లు ఆయా సినిమాలు థియేటర్లో విడుదలైన రోజునే మీ ఇంట్లో చూడవచ్చునని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ సౌకర్యాన్ని 2020 మిడిల్‌లో తీసుకు వస్తామని తెలిపారు. ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’గా పిలిచే ఈ ఆఫర్‌ను ప్రీమియం కస్టమర్లకు అందించనున్నట్లు తెలిపారు.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్లకు సవాల్

నెట్ ఫ్లిక్స్, అమెజాన్లకు సవాల్

దీంతో ఏ సినిమా ఎప్పుడు విడుదలైనా వచ్చే ఏడాది నుంచి మీరు ప్రీమియం కస్టమర్ అయితే ఇంట్లో చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమా రిలీజైన 40 రోజుల తర్వాత వస్తుంది. అయితే వీటికి వీటికి జియో ఫస్ట్ డే ఫస్ట్ షో సవాల్ కానుంది.

జియో ఫర్ ఎవర్ యాన్యువల్ ప్లాన్

జియో ఫర్ ఎవర్ యాన్యువల్ ప్లాన్

మరోవైపు, జియో ఫర్ ఎవర్ యాన్యువల్ ప్లాన్స్ తీసుకుంటే HD 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా అందిస్తుంది. రిలయెన్స్ జియో గిగా ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే ఇంటర్నెట్ స్పీడ్ 1 Gbps ఉంటుంది. సెకనుకు 1GB స్పీడ్‌తో డేటా పొందవచ్చు. ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ సెటాప్ బాక్స్ ఉచితంగా ఇస్తారు. అల్ట్రా హైడెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ లభిస్తాయి.

మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో డేటా సెంటర్లు

మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో డేటా సెంటర్లు

మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. మైక్రోసాఫట్ సరికొత్త క్లౌడ్ ప్లాట్‌ఫాంను తీసుకు వస్తుందన్నారు. భారత్ భవిష్యత్తు అలాగే రిలయన్స్ భవిష్యత్తు ఇప్పటి కంటే తనకు ఎప్పుడు ప్రకాశవంతంగా కనిపించలేదన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here