జియో వినియోగదారులకు చేదు వార్త

0
8


జియో వినియోగదారులకు చేదు వార్త : జియో ఇండియాలో ప్రకటించినప్పుడు అంబానీ గారు ఒక మాట చెప్పారు. జియో కి  రీఛార్జి చేయిస్తే  మన భారత దేశంలో ఎక్కడికైనా ఫ్రీ గా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ జియో ఇప్పుడు తన  వాగ్దానాన్ని ( promise ) ని నిల పెట్టుకోలేకపోయింది. ఇక నుంచి మీరు జియో నుంచి వేరొక నెట్వర్క్ కి కాల్ చేస్తే ( airtel, idea, bsnl, vodafone etc.. ) ఇప్పుడు నిమిషానికి 6 పైసలు కట్ అవుతాయి.

జియో ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ? 

Telecom Regulatory Authority of India (TRAI) (టెలికాం రేగులాటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ) interconnect usage charge (IUC) ( ఇంటర్ కనెట్ యూ సెజ్ ఛార్జ్ ) రేట్స్ ని సెట్ చేసింది.

IUC అంటే జియో నెట్వర్క్ నుంచి వేరే  నెట్వర్క్ కి కాల్ చేస్తే జియో వేరే నెట్వర్క్ కి డబ్బులు చెల్లించాలి. అలాగే వేరే నెట్వర్క్ వాళ్ళు జియో కి కాల్ చేస్తే ,వేరే నెట్వర్క్ వాళ్ళు జియో కి డబ్బులు చెల్లించాలి.

జియో ఇండియాలో మొదలై నప్పటి నుంచి జియో వేరే ఆపరేటర్ కి ( వేరే నెట్వర్క్ కి airtel, idea, bsnl, vodafone etc.. )  13,500 కోట్ల వరుకు చెల్లించింది. ఈ 3 సంవత్సరాలు జియో వినియోగదారుల నుంచి ఎలాంటి extra డబ్బులు తీసుకోకుండా  జియో నే సొంతగా వేరే ఆపరేటర్ కి డబ్బులు కడుతూ వచ్చింది. ఇక

నుంచి జియో వినియోగదారుల నుంచి ఈ డబ్బుని తీసుకొని వేరే నెట్వర్క్ కి చెల్లించనుండి. అందుకే ఇప్పుడు మీరు వేరే నెట్వర్క్ కి కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు పడతాయి.

6పైసలు / నిమిషానికి ఎప్పటి వరుకు ఉంటుంది ?

TRAI ఎప్పుడైతే IUC ఛార్జ్ లు తీసి వేస్తుందో అప్పటి వరకు ఇలాగే కొనసాగుతుంది. జనవరి 1 2020 తరువాత TRAI ఈ IUC చార్జెస్ ని తీసివేస్తుంది అని జియో చోబుతుంది. అప్పటి వరకు ఇలాగే కొనసాగుతోంది. ఒక వేళ TRAI IUC చార్జీలు ఎత్తివేయక పోతే ఈ  (6పైసలు / నిమిషానికి ) ఇదే కొనసాగుతుంది.

వేరే నెట్వర్క్ కి చేసినప్పుడు 6పైసలు / నిమిషానికి చార్జెస్ పడకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి ?

మీరు కనుక 10 రూపాయల తో IUC టాప్ అప్ ( రీఛార్జి ) చేయిస్తే 124 నిమిషాల వరుకు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో మాట్లాడ వచ్చు. మీరు 10 రూపాయలు రీఛార్జి చేసినందుకు జియో మీకు 1GB డేటా ఉచితంగా ఇస్తుంది. ఇలా ఎన్ని 10 రూపాయలు తో రీఛార్జి  చేయిస్తే అన్ని 1GB డేటా ఫ్రీ గా ఇస్తుంది.

మీరు కనుక 20 రూపాయలు తో రీఛార్జి  చేయిస్తే 249 నిమిషాల వరుకు ఉచితంగా వేరే నెట్వర్క్ కి కాల్ చేయవచ్చు, తరువాత నుంచి 6పైసలు / నిమిషానికి చార్జెస్ పడతాయి. 20 రూపాయలతో రీఛార్జి చేస్తే మీకు జియో ఉచితంగా 2GB డేటా ఇస్తుంది.

అదే మీరు కనుక 50 రూపాయలు తో రీఛార్జి  చేయిస్తే 656  నిమిషాల వరుకు ఉచితంగా వేరే నెట్వర్క్ కి కాల్ చేయవచ్చు, తరువాత నుంచి 6పైసలు / నిమిషానికి చార్జెస్ పడతాయి. 50 రూపాయలతో రీఛార్జి చేస్తే మీకు జియో ఉచితంగా 5GB డేటా ఇస్తుంది.

అదే మీరు కనుక 100 రూపాయలు తో రీఛార్జి  చేయిస్తే 1362  నిమిషాల వరుకు ఉచితంగా వేరే నెట్వర్క్ కి కాల్ చేయవచ్చు, తరువాత నుంచి 6పైసలు / నిమిషానికి చార్జెస్ పడతాయి. 100 రూపాయలతో రీఛార్జి చేస్తే మీకు జియో ఉచితంగా 10GB డేటా ఇస్తుంది.

జియో పోస్ట్ పైడ్ ( post paid ) వినియోగదారులకు కూడా 6పైసలు / నిమిషానికి చార్జెస్ పడుతాయి.

6పైసలు / నిమిషానికి చార్జెస్ ఎవరికి పడవు ?

1. మీ జియో నెంబర్ నుంచి వేరొక జియో నెంబర్ కి ఫోన్ చేస్తే మీకు 6పైసలు / నిమిషానికి చార్జెస్ వర్తిచదు. మీరు ఫ్రీ గా ఎంత సేపైన మాట్లాడు కోవచ్చు.

2. మిగత నెట్వర్క్ వాళ్ళు మీ జియో నెంబర్ కి కాల్ చేస్తే 6పైసలు / నిమిషానికి చార్జెస్  పడవు.

3. జియో డేటా నుంచి వేరే వాళ్లకి వాట్స్ యాప్ ( whats app) కాల్ చేసిన ఈ చార్జెస్ పడవు.

4. ల్యాండ్ లైన్ ద్వారా, ఫేస్ టైమ్ యాప్ ద్వారా కాల్ చేసిన ఈ  చార్జెస్ పడవు.

ఇది ఫ్రెండ్స్, జియో కొత్త IUC చార్జెస్ గురించి పూర్తి వివరాలు. జియో కొత్త  చార్జెస్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియ చేయండి.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here