జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాలకు తీపి కబురు

0
0


జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాలకు తీపి కబురు

మూడు పీజీ స్థానాలు మంజూరు

జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాలకు ఎట్టకేలకు మూడు పీజీ సీట్లు దక్కాయి. వైద్యకళాశాలలో పలు విభాగాలకు పీజీ సీట్లు కేటాయించాలని ఎంసీఐకి ఇటీవల దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వాటిలో ఫోరెన్సిక్‌ విభాగం సైతం ఉంది. ఈ విభాగానికి మూడు పీజీ సీట్లు కేటాయించాలని కోరడంతో నెల రోజుల క్రితం ఎంసీఐ బృందం వైద్యకళాలకు వచ్చి తనిఖీలు చేసి వెళ్లింది. ఫోరెన్సిక్‌ విభాగంలో ఉన్న సౌకర్యాలపై ఎంసీఐ బృందం సంతృప్తి చెందడంతో మూడు పీజీ సీట్లు కేటాయిస్తున్నట్లు మంగళవారం ఎంసీఐ నుంచి లేఖ పంపించారు. ఈ పీజీ సీట్లు కేటాయించడంతో వైద్యవిద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందుతుంది. శవపరీక్షల విభాగంలో సైతం ఇక నుంచి ఎలాంటి సమస్యలు ఉండవు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్యులు ఫోరెన్సిక్‌ విభాగంలో రెండేళ్ల పాటు పీజీ చదవాల్సి ఉంటుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ సీట్లను భర్తీ చేస్తారు. వైద్యకళాశాలలో మరో 14 విభాగాలకు 108 సీట్లు కేటాయించాల్సి ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here