జిల్లా రజక ఐక్య వేదిక యువజన కమిటీ ఎన్నిక

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి రజక సంఘంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రజక ఐక్య వేదిక జిల్లా సమన్వయ కర్త భరత్‌ చంద్ర మల్లయ్య మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లి రజక సంఘ భవనంలో నిజామాబాద్‌ జిల్లా యువజన కమిటీ ఎన్నికలు జరుగనున్నాయని ఎన్నికల ఇన్‌చార్జి తెలిపారు. ఎన్నికల సమావేశానికి ఆర్మూర్‌ పట్టణ కమిటీ ఆతిథ్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలకు జిల్లాలోని అన్ని మండలాల నుండి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై జిల్లా యువజన కమిటీ ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షుడు శంకర్‌, కార్యదర్శి భూషణ్‌, శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here