జీడీపీలో 7వ స్థానానికి పడిపోయిన భారత్, వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్‌లో 2 ర్యాంకులు వెనుకంజ

0
0


జీడీపీలో 7వ స్థానానికి పడిపోయిన భారత్, వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్‌లో 2 ర్యాంకులు వెనుకంజ

ప్రపంచం లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగుల్లో భారత్ కాస్త వెనుకపడింది. అందరు అనుకున్నట్లు మన రాంక్ మెరుగు పడటం లేదు కదా… తగ్గి పోతోంది. ఇందుకు ఉదాహరణే ప్రస్తుత ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గ్లోబల్ ఎకానమీ ర్యాంకులు. 2018 సంవత్సరానికి జీడీపీ ప్రకారం వరల్డ్ బ్యాంకు నివేదిక లో భారత్ ఏడో స్థానం లో నిలిచింది. 2.7 ట్రిలియన్ డాలర్లు గా మన జీడీపీ ని లెక్క కట్టింది. 2017 లో భారత స్థానం 5 కావడం గమనార్హం. ది టైమ్స్ అఫ్ ఇండియా ఒక కథనంలో ఈ విషయాన్నీ వెల్లడించింది. అఖండ మెజారిటీతో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ … ఈ సారి ఎలాగైనా భారత్ ను ప్రపంచంలోనే సూపర్ పవర్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం తొలిసారి ఒక మహిళా ఆర్థిక మంత్రికి బాధ్యతలు అప్పజెప్పారు. ఆర్థిక మంత్రి హోదాలో జులై 5 న నిర్మల సీతారామన్ తోలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. దాదాపు అన్ని రంగాలను సంతృప్తి పరిచినట్లుగా కనిపించిన బడ్జెట్… సంపన్నులను మాత్రం నిరాశ పరిచింది. కానీ దీర్ఘకాలిక లక్షలను సాధించేందుకు సరైన మార్గాన్ని వేసినట్లుగా అనిపించింది. అయితే, అటు గ్లోబల్ పరిణామాలు, ఇటు భారత్ లో అంతర్గతంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులు మనకు ఎదురు గాలి వీచేలా చేస్తున్నాయి.

అమెరికానే సూపర్ పవర్….

వరల్డ్ బ్యాంకు జీడీపీ ర్యాంకింగుల ప్రకారం … యధావిధిగా అగ్రరాజ్యం అమెరికానే తోలి స్థానంలో నిలిచింది. దానికి సమీపంలో కూడా మరె ఆర్థిక వ్యవస్థ కనిపించలేదు. 20.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా జీడీపీ తిరుగులేని స్థాయిలో తోలి స్థానం సంపాదించింది. కాగా అమెరికా తో వాణిజ్య యుద్ధం కొనసాగిస్తున్న పొరుగు దేశం చైనా రెండో స్థానంలో నిలిచింది. 13.6 ట్రిలియన్ డాలర్ల జీడీపీ తో ముందు ముందు అమెరికా ను ఢీ కొట్టేది తానేనని నిరూపించింది. కొంత కాలంగా చైనా లోనూ ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. దానికి తోడు, అమెరికా విధించిన దిగుమతి సుంకాలతో చైనా కు కొత్త తలనొప్పి ఎదురైంది. అయినప్పటికీ 130 కోట్ల బలమైన కొనుగోలుదారులున్న ఆ దేశం ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. మరో ఆసియ దేశం జపాన్… వరల్డ్ బ్యాంకు ర్యాంకింగుల్లో మూడో స్థానంలో నిలిచింది. జపాన్ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లు అని ప్రపంచ బ్యాంకు లెక్క కట్టింది.

భారత్ ను వెనక్కి నెట్టిన ఫ్రాన్స్ …

ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రకారం వరల్డ్ బ్యాంకు ర్యాంకింగుల్లో మన దేశాన్ని ఫ్రాన్స్ వెనక్కు నెట్టింది. యురోపియన్ దేశాల్లో పటిష్ట ఆర్థిక వ్యవస్థ కలిగిన ఫ్రాన్స్ .. గ్లోబల్ ర్యాంకింగుల్లో 6వ స్థానాన్ని ఆక్రమించింది. 2017 లో భారత్ ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలను అధిగమించి ఐదో స్థానాన్ని చేరుకున్నా… ఒక్క ఏడాది కూడా దానిని నిలబెట్టుకోలేక పోయింది. ఇలా ఉండగా బ్రేక్సిట్ వంటి సంక్షోభాలు ఎదుర్కొంటున్న బ్రిటన్ (యూకే) మాత్రం ఐదో స్థానంలో నిలవడం విశేషం. అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా… యూకే మాత్రం తన స్థానాన్ని పదిల పరుచుకోంది. 2017 లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లు ఉండగా, యూకే 2.64 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 2.5 ట్రిలియన్ డాలర్లు స్థాయి లో నిలిచాయి.

5 ట్రిలియన్ డాలర్లు

ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న భారత్ జీడీపీ … మరి కొన్నేళ్ళ లోనే 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకొంటుందని అంచనా వేస్తున్నట్లు తన బడ్జెట్ ప్రసంగం లో నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. అంటే కాకుండా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సత్తా భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోడీ కూడా విశ్వాసం వ్యక్తం చేసారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. భారత్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే … 2008 ఆర్థిక మాంద్యం తరహాలో నే మన ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కనీసం 4-5 ఏళ్ళ సమయం పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయం లో 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీ ని సాధించాలంటే దేశం సగటున 12-13% వార్షిక వృద్ధి రేటును నమోదు చేయాలనీ చెబుతున్నారు. కానీ ప్రస్తుతం మన దేశం అందులో సగం వృద్ధి రేటు దశలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు. కాబట్టి, ఇప్పటికైనా ఆర్థిక మంత్రి మన దేశ జీడీపీ ని పరుగులు పెట్టించే విధానాలను అవలంభించాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here