జీపీఎఫ్‌ ఖాతాలు సరిగా ఉండాలి

0
0


జీపీఎఫ్‌ ఖాతాలు సరిగా ఉండాలి


ఉద్యోగులతో సమావేశమైన జడ్పీ సీఈవో గోవింద్‌
నిజామాబాద్‌ (జిల్లా పరిషత్‌), న్యూస్‌టుడే: ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి(జీపీఎఫ్‌)కి సంబంధించి ఖాతాల వివరాలు అన్ని సరిగా ఉండే విధంగా చూడాలని నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ సీఈవో గోవింద్‌ అన్నారు. కామారెడ్డి జడ్పీ సీఈవో కాంతమ్మతో పాటు నిజామాబాద్‌ జడ్పీ జీపీఎఫ్‌, కోశాధికారి కార్యాలయ సిబ్బందితో గురువారం తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. ‘వడ్డింపు బకాయి’ ఉద్యోగుల ఖాతాల్లో జమకాని జీపీఎఫ్‌ వడ్డీ శీర్షికన ‘ఈనాడు’లో గత నెల 29న కథనం ప్రచురితమైంది. దీనిపై రెండు జిల్లాల అధికారులతో సమావేశమై జీపీఎఫ్‌ ఖాతాలపై చర్చించారు. ఆన్‌లైన్‌లో ఖాతాల వివరాలు ఉద్యోగికి కనిపంచే విధంగా ఉండాలన్నారు. ఇంకా ఆన్‌లైన్‌లో ఖాతాల వివరాలు నమోదు కాకుండా ఏమైనా ఉంటే వాటిని పొందపర్చాలని ఆదేశించారు. జీపీఎఫ్‌ ఖాతాల విభజన విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేవని..మొత్తం ఖాతాల వివరాలు నిజామాబాద్‌ జడ్పీలోనే ఉంటాయని చెప్పారు. ఉద్యోగికి రావల్సిన వడ్డీ ఎంత ఉందో లెక్కలు తీయాలన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్‌ జడ్పీ ఏవో కృష్ణమూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు.
 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here