జీవాల పెంపకం దారులకు దాణా పంపిణీ

0
4నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవాల పెంపకం దారులకు రెండవ విడత దాణా పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆలూరు గ్రామంలో 50 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి రెండు క్వింటాళ్ళ దాణా (206 కిలోల) దాణాను పూర్తి ఉచితంగా పంపిణీ చేసినట్టు మండల పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ లక్కం ప్రభాకర్‌ తెలిపారు. దాణా పంపిణీ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ కళ్ళెం మోహన్‌ రెడ్డి సభాధ్యక్షత వహించగా, ఉప సర్పంచ్‌ దుమ్మాజి శ్రీనివాస్‌, నాయకులు చిన్నారెడ్డి, మల్లేష్‌, జిల్లా రైతు సమన్వయ సమితి డైరెక్టర్‌ మూలాకిడి శ్రీనివాస్‌ రెడ్డి, ఆలూరు సొసైటీ చైర్మన్‌ నల్మేల మోహన్‌ రెడ్డి, ఆలూరు పశువైద్యశాల ఇంచార్జి డాక్టర్‌ శైలజ, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘ మండల అధ్యక్షుడు తోట భాజన్న కార్యక్రమానికి హాజరై జీవాల పెంపకం దారులకు సమీకత దాణా పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, జీవాల పెంపకందారులు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమ సోదరుల కోసం చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here