జుట్టు తెచ్చిన ఖ్యాతి 

0
4


జుట్టు తెచ్చిన ఖ్యాతి 

జపాన్ : మీరు సామాజిక మాధ్యమాల్ని ఉపయోగిస్తున్నారా? ఫేస్ బుక్, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. విరివిగా వాడుతున్నారా? అయితే మీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? నిరంతరం సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ ఉండి ఉంటే.. మహా అయితే ఓ ఐదు వేలకు మించి ఉండరు. కానీ ఓ చిన్నారి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానించే వారిసంఖ్య అక్షరాలా లక్షా యాభై వేల మందికి పైగా ఉందంటే నమ్ముతారా? ఇంతకీ ఎవరా చిన్నారి.. ఏమిటా కథ..

2017 డిసెంబర్ నెలలో జపాన్‌లో చిన్నారి చాన్ కో జన్మించింది. పుట్టుకతోనే తల నిండా దట్టంగా నల్లని జుట్టుతో.. చూడగానే ఆకట్టుకునే రూపుతో అందరినీ కట్టిపడేసే అందం చాన్‌ సొంతం. ఆ జుట్టే ఇప్పుడా చిన్నారిని స్టార్‌ను చేసింది. ఆమె తల్లిదండ్రులు ‘హెయిర్ డైరీ’ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతాను ప్రారంభించారు. అందులో చిన్నారి చాన్ చిత్రాలను అప్‌లోడ్‌ చేశారు. అచ్చం బొమ్మలా ఉన్న ఆమె ముఖం, చూడగానే ఆకర్షించే దట్టమైన జుట్టు… ఇంకేముంది ఆమె కురులకు వీరాభిమానులు తయారయ్యారు. ఇప్పటికే ఆ చిన్నారిని అనుకరించే వారి సంఖ్య లక్షా యాభై వేలు దాటింది. ప్రస్తుతం ఈ ఖాతాను ఆమె తల్లిదండ్రులు నడుతున్నారు.

జుట్టు తెచ్చిన ఖ్యాతి 

ఇప్పటి వరకూ ఈ ఖాతా నుంచి కేవలం 46 పోస్టులు మాత్రమే చేశారు. అయినా ఆమె అందమైన జుట్టుతో రకరకాల ఫోటోలను ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తారా? అని అభిమానులు వేచి చూస్తున్నారు. ఒక్క జపాన్ నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాన్‌కు అభిమానులున్నారు.

ఇటీవల చాన్ జుట్టును ఆమె తండ్రి కత్తిరిస్తూ, సరిచేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. అందమైన ఆ జుట్టును కత్తిరించకండని ఒకరు.. ఈ చిన్నారి జుట్టును చూడండి.. ఇది విగ్ కాదని ఇంకొకరు, ఈ జుట్టు నాకు కావాలని మరొకరు, అందమైన చిన్నారి దేవదూతలా ఉందని మరొకరు, ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ చిన్నారి ఫోటోలకు ప్రతిదానికీ వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు గొప్పవాళ్లు కావాలని, పేరు ప్రఖ్యాతులు గడించాలని కోరుకుంటారు. ఏడు నెలల పసిప్రాయంలోనే అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న చాన్ కో ను చూసి ఆమె తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

 

Tags :

  • Chank Ko
  • Recored Hair



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here