జూనియర్ డాక్టర్ల ధర్నా.. హీరో రాజశేఖర్ మద్దతు.. కోదండరాం సైతం..!

0
3


జూనియర్ డాక్టర్ల ధర్నా.. హీరో రాజశేఖర్ మద్దతు.. కోదండరాం సైతం..!

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఎంసీ బిల్లును తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు డాక్టర్లు. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల వైద్య సేవల బంద్‌కు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోనూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ కుటుంబ సమేతంగా ధర్నా చౌక్ చేరుకుని డాక్టర్ల ఆందోళనకు

సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కూడా మద్దతు తెలిపారు. అదలావుంటే డాక్టర్ల ధర్నాతో తెలుగు రాష్ట్రాల్లో పేషెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏ ఆసుపత్రికి వెళ్లినా.. వైద్యం అందక బిక్కుబిక్కుమంటున్నారు.

ఎన్‌ఎంసీ బిల్లుపై గరం గరం.. వైద్యుల దేశవ్యాప్త సమ్మె

సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగారు. 24 గంటల పాటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిపివేశారు. ఆందోళనలో భాగంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు అందించబోమని ప్రకటించారు. కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వైద్యులు నిరసన గళం వినిపిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం స్పదించలేదని.. అందుకే 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోషియేషన్.

ఇందిరాపార్క్ దగ్గర జూడాల ధర్నా.. 32 క్లాజ్ తొలగించాలని డిమాండ్

ఇందిరాపార్క్ దగ్గర జూడాల ధర్నా.. 32 క్లాజ్ తొలగించాలని డిమాండ్

దేశవ్యాప్త నిరసనలో భాగంగా హైదరాబాద్‌లో జూనియర్ డాక్టర్లు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన చేపట్టారు. వైద్య మహా ఘటన పేరుతో ఆందోళనకు దిగారు. ఎన్ఎంసీ బిల్లులో కొన్ని క్లాజులు సవరించాలని డిమాండ్ చేశారు. క్లాజ్ నెంబర్ 32తో ప్రజలకు చాలా నష్టమని.. దాన్ని తొలగించాలని కోరారు. నీట్ పరీక్షలు కూడా గతంలో జరిగిన విధానంలో జరపాలని.. సెంట్రల్ గవర్నమెంట్ లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.

సినీనటుడు డాక్టర్ రాజశేఖర్ సంఘీభావం

సినీనటుడు డాక్టర్ రాజశేఖర్ సంఘీభావం

హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జూనియర్ డాక్టర్లు చేస్తున్న ధర్నాకు సంఘీభావం ప్రకటించారు సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్. కుటుంబ సభ్యులతో ధర్నా చౌక్ చేరుకున్న రాజశేఖర్ ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకించారు. ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తిచేస్తే డాక్టర్ అవుతారనే కొత్త నిబంధన తలనొప్పులు తెచ్చిపెడుతుందని వ్యాఖ్యానించారు. ఐదు సంవత్సరాలు కష్టపడి వైద్య విద్యను అభ్యసించి రోగులకు చికిత్స అందిస్తున్నప్పటికీ.. ఎవరైనా అనుకోకుండా చనిపోతే వైద్యులపై దాడులు చేస్తున్న సందర్భాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల పక్షాన ఉండాలని, హడావుడి నిర్ణయాలతో అందరూ ఇబ్బందిపడతారని వ్యాఖ్యానించారు.

న్యాయసమ్మతమైన ధర్నా.. అందుకే మద్దతు : కోదండరాం

న్యాయసమ్మతమైన ధర్నా.. అందుకే మద్దతు : కోదండరాం

జూనియర్ డాక్టర్ల సమ్మెకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మద్దతు ప్రకటించారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న ధర్నా న్యాయమైందని.. అందుకే తమ పార్టీ తరపున మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఎన్ఎంసీ బిల్లులో చాలా లోపాలున్నాయని, వాటిని సరిచేయడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఐదేళ్లు చదివిన తర్వాత మళ్లీ పరీక్ష రాయాలని.. అప్పుడే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుందని చెప్పడం సరికాదన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రోగుల కష్టాలు..!

వైద్యుల ఆందోళనతో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్‌తో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వైద్యసేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 24 గంటల బంద్ పిలుపుతో పలుచోట్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖపట్నం పెద్దాసుపత్రిగా పేరుగాంచిన కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి. డాక్టర్లు అందుబాటులో లేక రోగులు వెనక్కి వెళ్లిపోతున్నారు. డాక్టర్ల ధర్నాకు సంబంధించిన సమాచారం చాలామందికి తెలియక ఆసుపత్రికి వస్తున్నారు. జూడాల ఆందోళనకు సీనియర్ వైద్యులు కూడా సంఘీభావం ప్రకటించడంతో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏదిఏమైనా 24 గంటల డాక్టర్ల బంద్ పిలుపుతో తెలుగు రాష్ట్రాల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here