జో రూట్ లక్కీ: బంతి బెయిల్స్‌ను తాకినా కింద పడలేదు (వీడియో)

0
3


హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లాండ్ ఇంకా 17 పరుగుల దూరంలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రోరీ బర్న్స్‌(125), బెన్ స్టోక్స్(38) పరుగులతో ఉన్నారు. అయితే, ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ప్యాటిన్సన్‌ వేసిన 21వ ఓవర్‌ ఆఖరి బంతి రూట్‌ బ్యాట్‌ పక్క నుంచి కీపర్‌ పెయిన్‌ గ్లోవ్స్‌లోకి వెళ్లింది.

యాషెస్ తొలి టెస్టులోనే బర్న్స్‌ సెంచరీ: గత 100 టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఇది ఐదోది

బంతి బ్యాట్ అంచును తాకిందని

అయితే, శబ్దం రావడంతో ప్యాటిన్సన్‌ అప్పీల్ చేశాడు. బంతి బ్యాట్ అంచును తాకిందని భావించిన అంపైర్‌ విల్సన్‌.. జో రూట్‌ ఔట్‌గా ప్రకటించాడు. కానీ, బంతి తన బ్యాట్‌ అంచును తాకకపోవడంతో జో రూట్‌ రివ్యూకి వెళ్లాడు. రివ్యూలో బంతి బ్యాటును తాకలేదని స్నికోమీటర్‌ తేల్చింది.

బంతి బెయిల్స్‌ను తాకడంతో

బంతి బెయిల్స్‌ను తాకడంతో

దీంతో ఆ శబ్దం ఎక్కడిదని ఆసీస్ ఆటగాళ్లు అంఫైర్‌ని ప్రశ్నించారు. అయితే, ప్యాటిన్సన్‌ విసిరిన బంతి బెయిల్స్‌ను తాకడంతో ఆ శబ్దం వచ్చిందని ఫుటేజ్‌లో తేలింది. బంతి వేగంగా వచ్చి తాకడంతో వికెట్లు కూడా ఒకింత ఊగాయి. కానీ బెయిల్‌ కూడా కింద పడకపోవడంతో ఆసీస్‌ ఆటగాళ్లు అవాక్కయ్యారు.

బెయిల్స్‌ను మార్చాలని అంపైర్‌ను కోరిన ఆసీస్ ఆటగాళ్లు

అంపైర్‌ విల్సన్‌కు తమ నిరసన తెలిపారు. దీంతో ప్యాటిన్సన్‌తోపాటు ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్ పైన్ సైతం బెయిల్స్‌ను మార్చాలని అంపైర్‌ను కోరారు. అందుకు అంఫైర్ నిరాకరించాడు. బంతులు తాకినా బెయిల్స్‌ పడకపోవడంవంటి ఘటనలు ఇటీవల వరల్డ్‌క్‌పలోనూ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం

కాగా, రోరీ బర్న్స్‌ (125) అజేయ సెంచరీకి తోడు కెప్టెన్‌ రూట్‌ హాఫ్ సెంచరీ (57) తోడవడంతో ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here