జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దు

0
2


జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దు

మాట్లాడుతున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో జ్వరం వస్తే ఇంట్లో కూర్చొని మాత్రలు వేసుకుంటూ కాలయాపన చేయొద్దని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం సూచించారు. సోమవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవగాహన లోపంతో జ్వరం రాగానే గ్రామంలోని వైద్యుల వద్దకు వెళ్లి మాత్రలు వేసుకుంటూ వారం నుంచి 10 రోజుల వరకు ఇంట్లోనే కూర్చొని పరిస్థితి తీవ్రమైన తర్వాత ఆసుపత్రులకు వెళ్లడం సరికాదన్నారు.ప్లేట్‌లెట్లు తగ్గిపోగానే భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి ప్లేట్‌లెట్లు ఎక్కించే అవసరం లేకుండానే డెంగీ వ్యాధిని పూర్తిగా నయం చేయొచ్చన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో రోగులను అనవసరంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికే మూడు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లేట్‌లెట్లు అవసరం లేకుండానే ఇప్పటి వరకు 250 మందికి చికిత్స చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లేట్‌లెట్లు నిల్వచేసే ప్యాకెట్లు రెండు రోజుల్లో సరిపడా తెప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ తుకారం రాథోడ్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here