జ్వరాలపై మరింత ప్రచారం అవసరం

0
1


జ్వరాలపై మరింత ప్రచారం అవసరం


జ్వరాలపై ప్రచార పత్రాలను ఆవిష్కరించిన డీఎంహెచ్‌వో

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జ్వరాలపై మరింత ప్రచారం అవసరమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. సోమవారం నగరంలోని జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో ఐఏంఏ ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచార పత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే ఇతర జిల్లాలతో పోల్చితే నిజామాబాద్‌ జిల్లాలో తక్కువగా జ్వరాలు నమోదయ్యాయన్నారు. సమయానికి ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయడంతో పరిస్థితి చక్కబడిందన్నారు. మరింతగా ప్రజల్లో అవగాహన కల్పిస్తే జ్వరాలు రాకుండా జాగ్రత్త పడొచ్చన్నారు. జ్వరాలపై ప్రచారం చేసేందుకు ఐఎంఏ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు జీవన్‌రావు, కార్యదర్శి మానసిక వైద్యనిపుణుడు విశాల్‌, వినోద్‌కుమార్‌ గుప్తా, రాజేశ్‌, హరీష్‌, నాగమోహన్‌, జలగం తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here