టాటాసన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వేతనం రూ.65.25 కోట్లు

0
2


టాటాసన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వేతనం రూ.65.25 కోట్లు

ముంబై: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ 2019 ఆర్థిక సంవత్సరానికి గాను భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆయనతో పాటు కంపెనీకి చెందిన ప్రముఖుల వేతనాలు కూడా భారీగానే ఉన్నాయి. గత ఏడాది కంటే ఇప్పుడు రూ.10 కోట్లకు పైగా ఎక్కువ మొత్తాన్ని చంద్రశేఖరన్ అందుకుంటున్నారు. 2018లో ఆయన రూ.55.11 కోట్ల రెమ్యునరేషన్ అందుకోగా, 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.65.52 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. అంటే ఆయన వేతనంలో 19 శాతం పెరుగుదల ఉంది.

చంద్రశేఖరన్ వేతనంలో రూ.54 కోట్లు కమిషన్‌గా అందుకుంటున్నారు. 2018లో ఆయన రూ.47 కోట్ల కమీషన్ తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌరబ్ అగర్వాలా వేతనం 22 శాతం పెరిగి రూ.16.45 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రాఫిట్‌లో భాగంగా రూ.12 కోట్లు కమీషన్ రూపంలో అందుకుంటున్నారు.

ఇండిపెండెంట్ డైరెక్టర్ వేణు శ్రీనివాస్ కమీషన్ తీసుకోవడానికి నిరాకరించారు. మరో ఇండిపెండెంట్ డైరెక్టర్ అజయ్ పిరామిల్ రూ.1.9 కోట్ల కమీషన్ తీసుకుంటున్నారు. ఇతర డైరెక్టర్లు రోనేంద్ర సేన్ రూ.2 కోట్లు, హరీష్ మన్వాణీ రూ.1.85 కోట్లు, ఫరీదా ఖంబాటా 1.9 కోట్లు కమీషన్‌గా తీసుకున్నారు. ముంబైలో ఆగస్ట్ థర్డ్ వీక్‌లో జరగనున్న టాటా సన్స్ 101 యాన్యువల్ జనరల్ మీటింగులో వీటిని అందజేస్తారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here