టాప్ 10 కంపెనీల నష్టం రూ.84,354 కోట్లు, రిలయన్స్ లాభం రూ.72,153 కోట్లు

0
1


టాప్ 10 కంపెనీల నష్టం రూ.84,354 కోట్లు, రిలయన్స్ లాభం రూ.72,153 కోట్లు

ముంబై: గత వారం టాప్ 10 కంపెనీల్లో తొమ్మిది కంపెనీలు రూ.84,354.1 మార్కెట్ వ్యాల్యుయేషన్ నష్టాన్ని మూటగట్టుకున్నాయి. నష్టపోయిన కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ముందుంది. గత వారం ఎక్కువ సెలవులు వచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గత వారం 231.58 పాయింట్లు నష్టపోయింది. టాప్ 10 కంపెనీల్లో లాభపడిన ఒకే ఒక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL). ముఖేష్ అంబానీ గిగా ఫైబర్, ఆరామ్‌కోతో ఒప్పందం తదితర ప్రకటనలు చేసిన తర్వాత రిలయన్స్ షేర్లు దూసుకుపోయాయి.

రూ.72వేల కోట్లు పెరిగిన రిలయన్స్ ఎం-క్యాప్

గత వారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.72,153.08 కోట్లు పెరిగి రూ.8,09,755.16 కోట్లకు చేరుకుంది. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనివర్ లిమిటెడ్, (HUL), HDFC, ఇన్ఫోసిస్, ITC, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, SBIలు నష్టాలను చవి చూశాయి.

రూ.30వేల కోట్లు కోల్పోయిన టీసీఎస్

రూ.30వేల కోట్లు కోల్పోయిన టీసీఎస్

టీసీఎస్ ఎం-క్యాప్ శుక్రవారం సాయంత్రం నాటికి రూ.30,807.1 కోట్లు తగ్గి రూ.8,11,828.43 కోట్ల వద్ద నిలిచింది. HDFC వ్యాల్యుయేషన్ రూ.19,495.4 తగ్గి రూ.3,62,123.92 కోట్లుగా, HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.15,065.8 తగ్గి రూ.6,08,826.25 కోట్లుగా నిలిచింది.

దిగజారిన ఇన్ఫోసిస్

దిగజారిన ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.6,700.27 దిగజారి రూ.3,32,672.51 కోట్లుగా, కొటక్ మహీంద్రా ఎం-క్యాప్ రూ.6,525.48 తగ్గి రూ.2,86,340.99 కోట్లుగా, HUL ఎం-క్యాప్ రూ.2,954.95 తగ్గి రూ.3,95,335.97 కోట్లుగా, ITC ఎం-క్యాప్ రూ.1,657.41 దిగజారి రూ.3,10,488.97 కోట్లుగా ఉంది.

అయినా టీసీఎస్ టాప్

అయినా టీసీఎస్ టాప్

ICICI బ్యాంకు వ్యాల్యుయేషన్ రూ.790.71 కోట్లు పడిపోయి రూ.2,70,569.37, SBI మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.356.99 నష్టపోయి రూ.2,59,661.57గా ఉంది. అత్యధికంగా నష్టపోయిన టాప్ 10 కంపెనీల్లో టీసీఎస్ ఉన్నప్పటికీ ఎం-క్యాప్‌లో అదే నెంబర్ వన్ స్థానంలో ఉంది. టీసీఎస్ తర్వాత వరుసగా RIL, HDFC బ్యాంకు, HUL, HDFC, ఇన్ఫోసిస్, ITC, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, SBI ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here