టారిఫ్ ఎఫెక్ట్: ఇండియాను WTOకు లాగిన అమెరికా

0
2


టారిఫ్ ఎఫెక్ట్: ఇండియాను WTOకు లాగిన అమెరికా

వాషింగ్టన్: భారత్ – అమెరికా మధ్య టారిఫ్‌లపై వాణిజ్యపరమైన వేడి కొనసాగుతోంది. భారత్ దిగుమతులపై అగ్రరాజ్యం టారిఫ్‌లు పెంచింది. ఆ తర్వాత స్పెషల్ హోదాను కూడా తొలగించింది. దీంతో అమెరికా దిగుమతులపై భారత్ కూడా అధిక టారిఫ్ విధించింది. బాదాం, యాపిల్స్ తదితర దిగుమతులపై అధిక ట్యాక్స్ విధించింది.

WTOకు అమెరికా

ఈ నేపథ్యంలో వాషింగ్టన్.. ఢిల్లీ అధిక టారిఫ్‌లు విధించడంపై ప్రపంచ వ్ణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో)ను ఆశ్రయించింది. గత సంవత్సరం భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచేయడమే కాకుండా, GSP కింద భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్ ప్రయోజనాన్ని కూడా కొద్ది నెలల క్రితం ఎత్తివేసింది. దీంతో భారత్ కూడా అదే విధంగా వ్యవహరించింది.

మా ప్రయోజనాలకు భంగం

మా ప్రయోజనాలకు భంగం

అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్‌నట్స్‌, యాపిల్స్ తదితర 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచింది. దీంతో భారత్ చర్య అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ డబ్ల్యుటీవోను ఆశ్రయించింది. భారత్ విధించిన అదనపు సుంకాలు 1994 నాటి జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ (GATT) కింద తమ ప్రయోజనాలు రద్దు చేయడం లేదా బలహీనపరచడం చేస్తున్నట్లు డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది.

తేదీ చెప్పండి...

తేదీ చెప్పండి…

కాగా, GATT ఒప్పందం డబ్ల్యూటీవో పరిధిలోని సభ్య దేశాల మధ్య కస్టమ్స్ సుంకాల వంటి వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ఉద్దేశించింది. డబ్ల్యూటీవో పరిధిలోని మరే ఇతర సభ్య దేశం నుంచి సహజంగా ఉత్పత్తి అయ్యే ఈ తరహా దిగుమతులపై భారత్‌ సుంకాలు విధించవద్దని అమెరికా పేర్కొంది. అలాగే, భారత్‌ రాయితీల షెడ్యూల్లో పేర్కొన్న దాని కంటే కూడా విధించిన సుంకాల రేట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీనిపై ఇరువర్గాలకు అనుకూలంగా సంప్రదింపుల తేదీ చెప్పాలని కోరింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here