టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి అనూహ్యస్పందన

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో చేపట్టిన టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భూమారెడ్డి అన్నారు. మండలంలోని దండిగుట్ట గ్రామంలో మంగళవారం టిఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను అధ్యక్షుడు భూమారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండలంలోని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న కషికి ప్రజలు ఆకర్షితులై మునుపెన్నడూ లేని విధంగా పార్టీ సభ్యత్వాలను నమోదు చేసుకున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో బోధన్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు రఫిక్‌, కిష్టయ్య, రామక ష్ణ, అప్పారావు, వెంకన్న, కేశవులు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here