‘టిక్‌టాక్’ ప్రేమ.. చెట్టుకు కట్టి చెప్పుతో కొట్టిన ప్రియురాలు, ఆస్పత్రిలో ప్రియుడు

0
2


‘టిక్‌టాక్’ ఇప్పుడు ఓ వ్యసనంగా మారిపోయింది. రోజుకు ఒక్క టిక్‌టాక్ వీడియోనైనా చేయపోతే నిద్రపోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, టిక్‌టాక్ అన్నివేళలా మంచిది కాదని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన బుగప్పా(19) బుధవారం తన ప్రియురాలితో చెప్పుదెబ్బలు తిన్నాడు. ఆమె కుటుంబ సభ్యులు కూడా చితకబాదారు.

ప్రియురాలి కుటుంబ సభ్యులు బుగప్పాను చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ప్రియురాలు బుగప్పాను చెప్పుతో కొట్టడం, అతడి తల్లి తన కొడుకును కొట్టవద్దని వేడుకోవడం కనిపించింది. స్థానికులు కలుగజేసుకుని, గాయాలతో బాధపడుతున్న బుగప్పాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Read also: ‘పడిపోయా’ పాటకు టిక్‌టాక్ చేస్తూ.. నిజంగానే పడిపోయింది!

ఏం జరిగింది?: బుగప్పాను ప్రేమించిన ఆ యువతికి అంత కోపం రావడానికి కారణం టిక్‌టాక్ వీడియోనే. వీరి ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియదు. అయితే, ఇటీవల అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ‘టిక్‌టాక్’ వీడియోలో ఆమె కూడా కనిపించింది. ఆ వీడియో చేతులు మారి యువతి కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో వారు ఆమెను నిలదీయగా.. బుగప్పా ఆ వీడియో తీస్తున్నట్లు తనకు తెలియదని తెలిపింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి పరువు తీశాడనే కారణంతో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బుగప్పా ఇంటికెళ్లింది. అతడిని వీధిలోకి లాక్కొచ్చి చెట్టుకు కట్టేసి చెప్పుతో కొట్టింది. ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయాలేదని పోలీసులు తెలిపారు.

Read also: టిక్‌టాక్‌తో నవ్వించిన ఆ చిన్నారి.. ఈ లోకాన్ని వీడింది, కన్నీళ్లు మిగిల్చింది!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here