టిజివిపి ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ జయంతి

0
4నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీజీవిపి (తెలంగాణ విద్యార్థి పరిషత్‌) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌ 113 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దేవునిపల్లిలో భగత్‌ సింగ్‌ విగ్రహానికి పుల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్‌ మాట్లాడుతూ భగత్‌ సింగ్‌ దేశ స్వతంత్ర పోరాటంలో తనదైన ముద్ర వేసి..దేశం కోసం చిన్న వయస్సులోనే ఉరికోయ్యలను ముద్దాడిన వీర అమర దేశ భక్తుడు అన్నారు. బ్రిటిష్‌ బానిస సంకెళ్ళ నుంచి భారత మాతను విముక్తి చేసేందుకు భగత్‌ సింగ్‌ పోరాటం త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన పోరాటం..దేశం కోసం చేసిన త్యాగం అజరామరమని, దేశ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. భగత్‌ సింగ్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనను స్మరించుకుందామని, భగత్‌ సింగ్‌ మాటలను కొన్నిటిని గుర్తు చేసుకుందామన్నారు. దేశం కోసం చనిపోయిన వారు ఎల్ల కాలం బ్రతికే వుంటారు, నేను ఆశయం, ఆశ మరియు జీవితం యొక్క పూర్తి మనోజ్ఞతను కలిగి వున్నానన్నారు. కార్యక్రమంలో టీజీవిపి నాయకులు రంగ నరేష్‌ గౌడ్‌, నవీన్‌ కుమార్‌, భూపాల్‌, బుచ్చయ్య, రమేష్‌, రమాకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here