టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ: సఫారీలతో టెస్టు సిరిస్‌ నుంచి బుమ్రా ఔట్

0
4


హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ మొత్తానికి దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు సెలక్టర్లు చోటు కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.

మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇప్పటికే ముగిసిన మూడు టీ20 సిరిస్ 1-1తో సమం అయింది. అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

బుమ్రా వీపు వెనుక భాగాన గాయం

బుమ్రా వీపు వెనుక భాగాన గాయం

బుమ్రా వీపు వెనుక భాగాన చిన్నపాటి గాయం కారణంగా రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన మొత్తానికి దూరమయ్యాడని బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టీ20ల సిరిస్ నుంచి జస్ప్రీత్ బుమ్రాకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్‌గా బుమ్రా

వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్‌గా బుమ్రా

ప్రస్తుతం బుమ్రా వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం జట్టుని ఎంపిక చేసినప్పుడు తొలుత ఉమేశ్ యాదవ్‌కి చోటు దక్కలేదు. అయితే, గాయం కారణంగా బుమ్రా సిరిస్ మొత్తానికి దూరమవడంతో సెలక్టర్లు ఉమేశ్‌కు అవకాశమిచ్చారు.

కేఎల్ రాహుల్‌కు దక్కని చోటు

కేఎల్ రాహుల్‌కు దక్కని చోటు

జట్టుని ప్రకటించిన సమయంలో అందరూ ఊహించినట్లే ఈ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో సెలక్టర్లు యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌కు చోటు కల్పించారు. విండిస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన రాహుల్‌ను తప్పించాలని విమర్శలు వచ్చిన నేపథ్యంలో సెలక్టర్లు అతడిని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ

టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ

అలాగే విండిస్ పర్యటనకు ఎంపికై.. తుది జట్టులో చోటు దక్కించుకోలేని రోహిత్ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేశారు. దీంతో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై అన్ని అన్ని ఫార్మాట్లలో రాణించిన యువ ఆటగాడు శుభమాన్ గిల్‌కు టెస్టుల్లో తొలిసారి పిలుపు వచ్చింది.

అక్టోబర్ 2 నుంచి తొలి టెస్టు

అక్టోబర్ 2 నుంచి తొలి టెస్టు

సపారీలతో టీ20 సిరిస్‌కు ఎంపిక కాని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టెస్టు్ల్లో చోటు కల్పించారు. మరో స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు మొండిచేయి చూపించారు. రిషభ్‌ పంత్‌తో పాటు వృద్ధిమాన్‌ సాహాను ఎంపిక చేశారు. అక్టోబర్ 2 నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.

విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు

విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టుకు విశాఖపట్నం(అక్టోబర్ 2-6) ఆతిథ్యమిస్తోంది. ఆ తర్వాత పుణె(అక్టోబర్ 10-14), రాంచీ(అక్టోబర్ 19-23) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి.

టెస్టు మ్యాచ్ షెడ్యూల్

విశాఖఫట్నం: October 2-6, 9:30 AM IST

పూణె: October 10-14, 9:30 AM IST

రాంచీ: October 19-23, 9:30 AM IST

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు టీమిండియా:

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు టీమిండియా:

విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే (వైస్‌కెప్టెన్) రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), పుజారా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here