టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఎంత మంది అప్లై చేశారో తెలుసా?

0
0


హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ సహా పలు ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది నియామకానికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కోచ్‌ల దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీని జులై 30గా బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ నిర్ణయించిన గడువు ముగియడంతో హెడ్ కోచ్ పదవికి మొత్తం రెండు వేల దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది.

మరింత ఆలస్యం కానున్న టీమిండియా కొత్త కోచ్ ఎంపిక!

ఆంగ్ల దినపత్రికలో కథనం

ఆంగ్ల దినపత్రికలో కథనం

ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కథనం ప్రచురించింది. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితోపాటు మాజీ క్రికెట‌ర్లు మ‌హేళా జ‌య‌వ‌ర్ద‌నేతో పాటు గ్యారీ కిర్‌స్టన్‌, టామ్‌ మూడీ, మైక్ హెస్సన్‌లతో పాటు న్యూజిలాండ్ మాజీ, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రస్తుత కోచ్ మైక్ హెస్సన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడని తెలుస్తోంది.

విదేశీ క్రికెటర్లతో పాటు భారత్ నుంచి కూడా

విదేశీ క్రికెటర్లతో పాటు భారత్ నుంచి కూడా

ఇక, భారత్ నుంచి మాజీ క్రికెటర్లు రాబిన్‌సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు కూడా ఇటీవలే ఈ పదవికి దరఖాస్తు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ జాంటీ రోడ్స్ దరఖాస్తు చేశాడు. ప్రస్తుతం కోచ్‌లుగా పనిచేస్తున్న వారితోపాటు ఇతర సిబ్బందిని కూడా బీసీసీఐ విండిస్ పర్యటన ముగిసేవరకు కొనసాగించనుంది.

కొత్త కోచ్‌ని ఎంపిక చేసేది వీరే

కొత్త కోచ్‌ని ఎంపిక చేసేది వీరే

ఇక మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన క్రికెట్ సలహా కమిటి(సీఏసీ) కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది. ఈ కమిటీలో మాజీ క్రికెట‌ర్లు క‌పిల్ దేవ్‌, మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిల‌ు సభ్యులుగా ఉన్నారు.

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై

అయితే, కొత్త కోచ్‌ని ఎంపిక చేయనున్న క్రికెట్ సలహా కమిటి(సీఏసీ)కి బీసీసీఐ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఇప్పటికే కామెంటేటర్లుగా, కోచ్‌లుగా లేదా అకాడమీని నడుపుతున్నారు. దీని కారణంగా కోచ్ ఎంపిక మరింత ఆలస్యం కానుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here