టీయూలో తరగతులను బహిష్కరించిన విద్యార్థులు

0
1


టీయూలో తరగతులను బహిష్కరించిన విద్యార్థులు

నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. కౌన్సిలింగ్‌ అనంతరం మిగిలిన సీట్లను వెంటనే స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని కోరారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అవకాశం కల్పించాలని కళాశాలలో తరగతులను బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని విభాగాల్లో మిగిలిపోయిన సీట్లను వెంటనే భర్తీ చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా అధికారులు స్పందించాలని.. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here