టెంపరరీ!: ఆ కంపెనీలో 4 రోజులే పని, దాదాపు 40% పెరిగిన లాభాలు

0
0


టెంపరరీ!: ఆ కంపెనీలో 4 రోజులే పని, దాదాపు 40% పెరిగిన లాభాలు

రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు… వారంలో ఏడు రోజులు… ఇదీ మన దగ్గర చాలామందికి తెలిసిన వర్కింగ్ హవర్స్. ఐటీ ఇండస్ట్రీ ఎదుగుతున్న కొద్దీ వారానికి ఐదు రోజులే వర్కింగ్ హవర్స్ అనే కాన్సెప్ట్ తెలిసింది. ఇప్పుడు దాదాపు అన్ని ఐటీ కంపెనీల్లోను వారానికి ఐదు రోజులే వర్కింగ్ డేస్. వీకెండ్స్… శని, ఆదివారాలు సెలవు రోజులు. వివిధ దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలు దీనిని ఫాలో అవుతున్నాయి. అయితే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా సరికొత్త ప్రయోగం చేస్తోంది. ఈ ప్రయోగం వల్ల కంపెనీ లాభాలు కూడా పెరగడం గమనార్హం.

వారంలో 4 రోజులు వర్కింగ్ డేస్.. 40% పెరిగిన ఉత్పత్తి

జపాన్‌లోని తన ఉద్యోగాలకు మైక్రోసాఫ్ట్ (మైక్రోసాఫ్ట్ జపాన్) వారానికి 4 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్‌గా అమలు చేసింది. మూడు రోజులు సెలవు దినాలే. దీంతో ఉద్యోగులు కూడా పనిని చాలా ఎంజాయ్ చేస్తున్నారట. నాలుగు రోజులు వర్క్‌లో ఎంజాయ్ చేస్తూ, వీకెండ్స్ మూడు రోజులు తమకు నచ్చిన విధంగా ఆనందిస్తున్నారు. వేతనాల్లో మాత్రం తగ్గింపు లేదు. వారంలో 4 రోజుల వర్కింగ్ డేస్ వల్ల ఇక్కడ ప్రోడక్టివిటీ 40 శాతం పెరిగిందట. ఈ ప్రయోగాన్ని ఆగస్ట్ నెలలో చేశారు.

విద్యుత్ ఆదా

విద్యుత్ ఆదా

వీక్‌లో 4 రోజుల సెలవు కారణంగా వివిధ రంగాల్లో తమ కంపెనీ మరింత సమర్థవంతంగా మారిందని మైక్రోసాఫ్ట్ జపాన్ తెలిపింది. ప్రోడక్టివిటీ 40 శాతం పెరగడంతో పాటు 23 శాతం విద్యుత్ ఆదా అయిందని పేర్కొంది. ఆగస్ట్ నెలలో ఐదు శుక్రవారాలు సెలవు తీసుకున్నప్పటికీ ఉత్పాదకత పెరిగిందని తెలిపింది.

మరోసారి ప్రయోగం చేస్తాం...

మరోసారి ప్రయోగం చేస్తాం…

ఆ నెలలో ఉద్యోగులకు పెయిడ్ లీవ్‌గా పరిగణించి ప్రతి శుక్రవారం సెలవు ఇచ్చారు. దీంతో ఫలితాలు చాలా బాగున్నట్లు మైక్రోసాఫ్ట్ జపాన్ తెలిపింది. ప్రస్తుతం గత సీజన్‌లో ప్రయోగం చేశామని, శీతాకాలంలో కూడా మరోసారి ఈ ప్రయోగం చేస్తామని తెలిపింది.

సమయం ఆధా...

సమయం ఆధా…

మైక్రోసాఫ్ట్ జపాన్ వారంలోని ఏడు రోజుల్లో… వీకెండ్స్ అయిన శుక్ర, శని, ఆదివారాలు సెలవులు ఇచ్చి ప్రయోగం చేసింది. ఇక పని చేసేది కేవలం నాలుగు రోజులే. కాబట్టి లంచ్, మీటింగ్ వంటి సమయాన్ని తగ్గించింది. సమావేశ కాల వ్యవధిని గంట నుంచి అరగంటకు తగ్గించింది. దీంతో సమయం ఎక్కువగా ఆదా అయి, ఉద్యోగులు పని చేసేందుకు మరింత సమయం దొరికింది.

వారానికి 4 డేస్.. పర్మినెంట్

వారానికి 4 డేస్.. పర్మినెంట్

4 డే వర్క్ 2018లోనే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ ట్రస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ… పర్పెట్యువల్ గార్డియన్ దీనిని అమలు చేసింది. ఉద్యోగులకు నాలుగు రోజులు వర్కింగ్ డేస్‌తో పాటు ప్రోడక్టివిటీ లాభాలపై 20 శాతం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ నెలలోనే ఈ కంపెనీ వారానికి నాలుగు రోజుల వర్కింగ్ డేస్ పాలసీని పర్మినెంట్ చేసింది.

పర్మినెంట్ చేసేనా?

పర్మినెంట్ చేసేనా?

మైక్రోసాఫ్ట్ ట్రయల్ వేసినప్పటికీ ప్రోడక్టివిటీ భారీగా పెరిగింది. అయితే జపాన్‌లోనే మరోసారి పరిశీలించనుంది. దీనిని ఇతర దేశాల్లోను మైక్రోసాఫ్ట్ పరీక్షిస్తుందా లేదా, అలాగే శాశ్వతంగా అమలు చేస్తుందా లేదా చూడాల్సి ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here