టెస్టు జెర్సీలపై నంబర్లూ, పేర్లు వికారంగా: గిల్లీతో ఏకీభవించిన బ్రెట్ లీ

0
0


హైదరాబాద్: సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు కొత్త హంగులు అద్దే క్రమంలో ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన జెర్సీ నంబర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టా‍త్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా టెస్టు జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లను ముద్రించిన సంగతి తెలిసిందే.

మైదానంలో ఆటగాళ్లను అభిమానులు గుర్తించేందుకు వీలుగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. 142 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఇలా జెర్సీలపై ఆటగాళ్ల పేర్లతో పాటు నంబర్లను ముద్రించడం ఇదే తొలిసారి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా యాషెస్‌ సిరీస్‌ నుంచి ఈ సంప్రదాయానికి తెరలేపారు.

‘సెంచరీ బాదిన స్మిత్‌ను ఎగతాళి చేయడం నిరాశకు గురిచేసింది’

పేర్లు చెత్తగా ఉన్నాయి

పేర్లు చెత్తగా ఉన్నాయి

టెస్టు క్రికెట్‌లో ఆటగాళ్ల జెర్సీలపై నంబర్లూ, పేర్లు చెత్తగా ఉన్నాయంటూ ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడగా.. తాజాగా ఆ దేశ మాజీ పేసర్ బ్రెట్‌లీ కూడా గిల్లీ అభిప్రాయంతో ఏకీభవించాడు. ఇదొక పనికిమాలిన నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

100 యాషెస్‌ వికెట్లు.. స్టువర్ట్‌ బ్రాడ్‌ అరుదైన రికార్డు

నేను వ్యతిరేకిస్తున్నా

“ఆటగాళ్ల పేర్లు, నంబర్లు జెర్సీలపై దర్శనమిస్తున్న విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. టెస్టు క్రికెట్‌లో ఆటగాళ్ల జెర్సీలపై నంబర్లూ, పేర్లు వికారంగా ఉన్నాయి. ఇది పనికిమాలిన చర్యగా కనబడుతోంది. క్రికెట్‌లో మార్పులు తీసుకురావడానికి ఐసీసీ చర్యలు చేపట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా సరైనది కాదు” అని బ్రెట్‌ లీ పేర్కొన్నాడు.

చెత్తగా ఉందన్న గిల్‌క్రిస్ట్

టెస్టు జెర్సీలపై క్రికెటర్ల పేర్లూ, నంబర్లు ముద్రించడం చాలా చెత్తగా ఉందని మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. “ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడింది. మనమింకా పోటీలో ఉన్నాం. ఇలా చెబుతున్నందుకు మన్నించండి. కానీ.. జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు నచ్చడం లేదు” అని ఒక ట్వీట్‌ చేశాడు.

ఆ అధికారం లేదు: బీసీసీఐకి కేంద్ర క్రీడాశాఖ మధ్య చిచ్చు పెట్టిన పృథ్వీ షా నిషేధం

నా క్షమాపణల్ని వెనక్కి తీసుకుంటున్నా

ఆ తర్వాత మరొక ట్వీట్‌లో “నిజం చెప్పాలంటే నా క్షమాపణల్ని వెనక్కి తీసుకుంటున్నా. పేర్లూ, నంబర్లు చెత్తగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ యాషెస్‌ను ఆస్వాదించండి” అని గిల్ క్రిస్ట్ ట్వీట్ చేశాడు. కాగా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ యాషెస్ సిరిస్‌తోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొమ్మిది జట్లు

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొమ్మిది జట్లు

ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా తొమ్మిది జట్లు 71 మ్యాచ్‌ల్లో 27 ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు ఆడనున్నాయి. ప్రతీ జట్టూ మిగిలిన ఎనిమిది జట్లలోని ఏవైనా ఆరు జట్లతో తలపడనున్నాయి. ఇందులో భాగంగా మూడు సిరీస్‌లు స్వదేశంలో ఆడగా మిగతా మూడు సిరిస్‌లు విదేశాల్లో ఆడతాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here