టెస్టు ర్యాంకింగ్స్‌.. భారత్ అగ్రస్థానంపై కివీస్‌ కన్ను

0
0


గాలె: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంకు న్యూజిలాండ్‌ నుండి ప్రమాదం పొంచి ఉంది. అద్భుత ఆటతో ప్రపంచకప్ ఫైనల్ వరకు వెళ్లి అనూహ్యంగా ఓడిపోయిన న్యూజిలాండ్.. సరిగ్గా నెల రోజుల విశ్రాంతి అనంతరం తొలిసారి మైదానంలోకి బరిలోకి దిగుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్‌ ఈ రోజు కొలంబోలో ప్రారంభం అయింది.

రోహిత్ మరో 26 పరుగులు చేస్తే యువరాజ్‌ రికార్డు బద్దలు

 అగ్రస్థానంపై కివీస్‌ కన్ను:

అగ్రస్థానంపై కివీస్‌ కన్ను:

ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ 113 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ 109 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. లంకతో జరిగే సిరీస్‌ను కివీస్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తే.. 115 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అయితే త్వరలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-0తో సాధిస్తే తిరిగి అగ్రస్థానంను కైవసం చేసుకుంది. టెస్టులో పటిష్టంగా ఉన్న భారత్.. వెస్టిండీస్‌పై సిరీస్ నెగ్గడం సులువే. అదే విధంగా బలహీన లంకపై కివీస్ కూడా గెలవడం సులువే.

 కివీస్‌ను ఎదుర్కోవడం పరీక్షే:

కివీస్‌ను ఎదుర్కోవడం పరీక్షే:

ప్రపంచకప్‌ అనంతరం ఆడుతున్న న్యూజిలాండ్‌ ప్రదర్శనపై అందరూ ఆసక్తితో ఉన్నారు. ఉపఖండం కాబట్టి స్పిన్నే ప్రధానాయుధం. స్పిన్, పేస్ విభాగంలో పటిష్టంగా ఉన్న కివీస్‌ను ఎదుర్కోవడం లంక బ్యాట్స్‌మన్‌కు పరీక్షే. ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, కొలిన్ గ్రాండ్‌హోమ్ పేస్.. ఎజాజ్ పటేల్‌,టాడ్ ఆస్టల్‌లు స్పిన్ భారాన్ని మోయనున్నారు. బలహీనంగా ఉన్న శ్రీలంక.. బౌల్ట్ బృందాన్ని ఏమేరకు ఆడుతుందో చూడాలి.

ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాలు లేవు.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా మార్గం సుగమం

కివీస్‌కు ఇదే మంచి అవకాశం:

కివీస్‌కు ఇదే మంచి అవకాశం:

బ్యాటింగ్‌లో కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు రాస్ టేలర్, టామ్ లాథమ్, హెన్రి నికోల్స్, రావెల్ కీలకం. కెప్టెన్ కరుణ రత్నే, తిరిమన్నే, కుశాల్ పెరీరా, ధనుంజయ, ఏంజిలో మ్యాథ్యూస్ రాణిస్తే లంక పోటీలో నిలువగలదు. అయితే బౌలింగ్లో మాత్రం లంక మరింత బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకోవడానికి కివీస్‌కు ఇదే మంచి అవకాశం. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకోవాలని ప్రతి జట్టు భావిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here