టెస్లా కారు అభిమానులకు ఎలాన్ మస్క్ షాక్, ఐనా మోడీ ప్రభుత్వ నిర్ణయాలతో ఆశలు

0
1


టెస్లా కారు అభిమానులకు ఎలాన్ మస్క్ షాక్, ఐనా మోడీ ప్రభుత్వ నిర్ణయాలతో ఆశలు

వచ్చే ఏడాది(2020) భారత మార్కెట్లలోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయని కొద్ది రోజుల క్రితం అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా కార్ల యజమాని ఎలాన్ మస్కన్ వెల్లడించారు. ఇటీవల ఐఐటీ మద్రాస్ విద్యార్థులతో జరిగిన చర్చ సందర్భంగా భారత్‌లోకి టెస్లా కార్లు రానున్నాయని తెలిపారు. ఈ ఏడాది రావొచ్చునని, లేదంటే వచ్చే ఏడాది తప్పకుండా వస్తాయన్నారు. ఇప్పుడు మాత్రం ఆయన చేసిన ట్వీట్ మరోలా ఉంది.

భారత్‌లో సుంకాలు ఎక్కువ

భారత దేశంలో దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అధిక సుంకాలను టెస్లా కార్లు భరించలేనివిగా భావిస్తున్నామని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఆయన వ్యాఖ్యలను బట్టి 2020లో భారత మార్కెట్లోకి టెస్లా కార్లు వస్తాయని ఎంతోమంది భారతీయులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అప్పుడే వచ్చేట్లుగా కనిపించడం లేదు.

ఫ్యూచర్‌పై ఆశలు

ఫ్యూచర్‌పై ఆశలు

భారతదేశంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు తమకు అవరోధంగా ఉన్నాయని, అయితే ఇటీవల చేస్తున్న మార్పులు, సేల్స్ ట్యాక్స్‌లో ప్రభుత్వం తీసుకుంటున్న మార్పులు భవిష్యత్తు తమకు అనుగుణంగా ఉంటుందని విశ్వాసంతో ఉన్నామని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. తద్వారా ఇటీవల తగ్గించిన జీఎస్టీని ఆయన స్వాగతించారు. ఎలాన్ చేసిన ట్వీట్‌ను టెస్లా క్లబ్ ఇండియా రీట్వీట్ చేస్తూ.. భారత్‌లో టెస్లాకు గల అడ్డంకులను వివరించారని పేర్కొంది.

టెస్లా క్లబ్ ఇండియా....

టెస్లా క్లబ్ ఇండియా….

రూ.27లక్షలకు పైబడిన కార్లకు భారత్‌లో దాదాపు వంద శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నారని టెస్లా క్లబ్ ఇండియా తెలిపింది. అత్యంత తక్కువ సుంకం 60% అన్నారు. టెస్లాలో అత్యంత చవకైన రూ.25 లక్షలు మోడల్ 3 కార్లకు మాత్రమే 60% సుంకం వర్తిస్తుందని తెలిపింది. భారత్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకం కేవలం పది శాతం నుంచి పదిహేను శాతమే ఉండవచ్చునని పేర్కొంది. ఇటీవల ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై భారీగా జీఎస్టీని తగ్గించడాన్ని ప్రస్తావించింది.

ఎప్పటి నుంచో..

ఎప్పటి నుంచో..

ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆసక్తితో ఉన్నారు. కానీ పలు కారణాలతో ఇప్పటిదాకా సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వ విధానాలు సైతం ఆలస్యానికి కారణయ్యాయని చెబుతారు. ఇప్పుడు మరోసారి ఆయన వ్యాఖ్యలను బట్టి అదే అర్థమవుతోంది. అయితే ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మోడీ ప్రభుత్వం మంచి ఆఫర్లు ఇస్తోంది. ఇటీవలే జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here