టోక్యో ఒలింపిక్స్: భారత్ నుంచి 11వ క్రీడాకారిణిగా చింకి యాదవ్

0
1


హైదరాబాద్: దోహా వేదికగా జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ చింకి యాదవ్ 25 మీ పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్‌కు రెండో కోటాను దక్కించుకున్నారు.

క్వాలిఫికేషన్స్‌లో మొత్తం 588 పాయింట్లు నమోదు చేయాడనికి గాను చింకి యాదవ్ 296 షాట్ కొట్టారు. మరోవైపు థాయ్‌లాండ్‌కు చెందిన నాఫాస్వాన్ యాంగ్‌పైన్‌బూన్ 590 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్ గేమ్స్‌కు అందుబాటులో ఉన్న నాలుగు స్థానాల్లో ఒకదాన్ని దక్కించుకునేందుకు ఆమె గురువారం 292 షాట్ కొట్టింది.

‘Any changes in CSK team?’: నెటిజన్లను ఆకట్టుకుంటోన్న సీఎస్‌కే ఫ్రాంచైజీ సమాధానం

కాగా, టోక్యో గేమ్స్ షూటింగ్‌లో భారత్‌కు ఇది 11వ కోటా కావడం విశేషం. 21 ఏళ్ల చింకి యాదవ్ ప్రస్తుతం మెడల్ గెలవడంపై దృష్టి సారించింది. మ్యూనిచ్‌ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో రాహి సర్నోబాట్ ఇప్పటికే భారత్‌ నుంచి షూటింగ్‌లో కోటాను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కాగా, ఇదే టోర్నీలో కాంస్య పతకం సాధించిన భారత షూటర్‌ దీపక్‌ కుమార్‌ భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పదో ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆసియా ఛాంపియన్‌షిప్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగం ఫైనల్‌ ఈవెంట్‌లో 227.8 స్కోరుతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

దీపక్ కుమార్ గతేడాది జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌లో కూడా కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. 626.8 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. రైఫిల్, పిస్టల్ విభాగాల్లో ఇప్పటికే భారత్ తొమ్మిది మంది టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

Kohli, Anushka reveals funny facts: ‘కోహ్లీ దుస్తులు వేసుకోవడమంటే చాలా ఇష్టం’

ఏప్రిల్‌లో దివ్యన్ష్ సింగ్ పన్వర్ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో భారత షూటర్‌గా దీపక్ కుమార్ నిలిచాడు. ఇక, ఆసియా నుంచి చైనా (25), కొరియా (12), జపాన్‌ (12) షూటర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here