ట్యాంకుబండ్‌పై కొండా లక్ష్మణ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతి పిత ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 104 వ జయంతి పద్మశాలి యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కామారెడ్డి పద్మశాలి సంఘం నుంచి కొత్త బస్టాండ్‌ వద్ద గల కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాముని సుదర్శన్‌ నేత మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవికీ 1969 సం.లో రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రజాప్రతినిధి ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, అటువంటి మహానుభావుని విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌ మీద ఆవిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బాపూజీ నివాసం, తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు ఐనటువంటి జలదశ్యంలో తెలంగాణ సాంస్కతిక కేంద్రాన్ని కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు మీద ఏర్పాటు చేయాలని అన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమం, పౌర హక్కుల (ముల్కి) ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అగ్రగణ్యులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవిత చరిత్రను స్కూల్స్‌, కాలేజీ పాఠ్యపుస్తకాలలో చేర్చాలని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ భారత రత్న ప్రకటించి గౌరవించాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆది గురువు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లాకు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here