ట్రంప్ షాకింగ్: ఆరోగ్య బీమా లేదా, డబ్బు చెల్లించలేరా.. ఐతే అమెరికాలోకి ఎంట్రీ లేదు

0
0


ట్రంప్ షాకింగ్: ఆరోగ్య బీమా లేదా, డబ్బు చెల్లించలేరా.. ఐతే అమెరికాలోకి ఎంట్రీ లేదు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారిపై ప్రభావం చూపుతుంది. అమెరికన్లకే ఉద్యోగాలు అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దిశగా ఇప్పటికే హెచ్‌1బీ వీసా సహా పలు నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆరోగ్య బీమాలేని లేదా వైద్య ఖర్చులను భరించే స్తోమతలేని వారిని దేశంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఆరోగ్య పరిరక్షణ విభాగానికి భంగం కలిగించని వారికి మాత్రమే వీసాలు జారీ చేస్తామని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధన వచ్చే నెల (నవంబర్) 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

30 రోజుల్లో…

వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇక నుంచి తాము 30 రోజుల్లోగా ఆరోగ్య బీమా తీసుకుంటామని లేదా ఆరోగ్య ఖర్చులు తామే భరించగలమని హామీ ఇవ్వాలి. అలా ఇవ్వని పరిస్థితుల్లో వీసాను తిరస్కరిస్తారని ఉత్తర్వుల్లో ఉంది. అక్రమ వలసదారులను అడ్డుకొని, అమెరికా పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరింత క్లిష్టతరం

మరింత క్లిష్టతరం

అమెరికా రావాలనుకునే వారికి ఈ నిర్ణయం మరింత క్లిష్టమైనదే. అంటే ఆరోగ్య బీమా లేకపోతే ఇబ్బందులు తప్పవు. బీమా లేకపోయినా లేదా వైద్య ఖర్చులను సొంతగా భరించగలమని నిరూపించలేని వారు ఇమ్మిగ్రెంట్ వీసా ద్వారా రావడాన్ని ఇకపై అనుమతించరు. దీనికి బీమా లేదా ఆర్థికపరమైన ఆధారం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి చూపించాలి.

నెల రోజుల్లో పూర్తి చేయాలి..

నెల రోజుల్లో పూర్తి చేయాలి..

వీసా దరఖాస్తు చేసుకునే వారు నెల రోజుల్లో పైవాటిని చూపించాలి. అమెరికాలో అడుగుపెట్టాక ఇస్తామంటే కుదరదు. ఆరోగ్య రక్షణ వ్యవస్థను, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, అమెరికా పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పరిహారం రాని ఆరోగ్య ఖర్చుల వల్ల గత పదేళ్లలో ప్రతి ఏటా 35 బిలియన్ డాలర్లకు పైగా వ్యయం అయినందు వల్ల కూడా కొత్త ఆంక్షలు అంటున్నారు.

భారతీయులపై ప్రభావం

భారతీయులపై ప్రభావం

తెలిసినవారి ద్వారా అంటే దగ్గరి బంధువులు లేదా మిత్రుల ద్వారా అమెరికాకు 35వేల మంది వరకు భారతీయులు వెళ్తుంటారని అంచనా. తాజా నిర్ణయంతో వీరిపై ప్రభావం పడుతుందని అంటున్నారు. అమెరికాలో వలసదారులు స్థిరపడటానన్ని క్లిష్టతరం చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. తాత్కాలిక టూర్, వర్క్ రిలేటెడ్ వీసాలకు ఇమ్మిగ్రెంట్ వీసా భిన్నం. అమెరికా పౌరులు స్పాన్సర్ చేసినవారికి లేదా గ్రీన్ కార్డుదారులు స్పాన్సర్ చేసినవారికి వీటిని మంజూరు చేస్తారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here