ట్విటర్‌లో వైరల్.. ‘బిగ్గెస్ట్‌ బాస్‌’తో విరాట్ కోహ్లీ

0
3


గయానా: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచ్‌లు అమెరికాలో జరగగా.. మూడో టీ20 మ్యాచ్‌ మంగళవారం రాత్రి గయానాలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సోమవారం భారత ఆటగాళ్లు విండీస్ చేరుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ను కలిశాడు. ఆయనతో కలిసి ఫొటో దిగాడు.

యాషెస్‌ సిరీస్: స్మిత్‌ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం

'బిగ్గెస్ట్‌ బాస్‌'తో కోహ్లీ:

‘బిగ్గెస్ట్‌ బాస్‌’తో కోహ్లీ:

వివ్‌ రిచర్డ్స్‌తో దిగిన ఫొటోని విరాట్ కోహ్లీ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేశాడు. అంతేకాదు ‘బిగ్గెస్ట్‌ బాస్‌’ వివ్‌ రిచర్డ్స్‌తో అని కోహ్లీ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోను కోహ్లీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. ‘ఇద్దరు లెజెండ్స్’ అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ‘గ్రేట్ బాస్‌’ అని మరో అభిమాని ట్వీటాడు.

కోహ్లీకి పెద్ద అభిమానిని:

గతంలో కోహ్లీని రిచర్డ్స్‌ ప్రశంసించిన విషయం తెలిసిందే. ‘కోహ్లీ దూకుడుగా ఉంటాడు. అతనికి పెద్ద అభిమానిని. నాకు మంచి బ్యాట్స్‌మన్‌, దూకుడుగా ఆడేవారు చాలా ఇష్టం. ఆస్ట్రేలియాపై ఎవరైనా అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తే కూడా బాగా ఇష్టపడతా. విరాట్‌ కోహ్లీ ఎంతో ప్రత్యేకం, అతని ఆట అంటే ఇష్టం. నేనూ తనలాగే ఆడేవాడిని. వివ్‌రిచర్డ్స్‌, విరాట్‌ ఒకే జట్టులో ఆడితే ఎలా ఉంటుందో మీరు ఊహించండి’ అని రిచర్డ్స్‌ పేర్కొన్నాడు.

 56 బంతుల్లోనే సెంచరీ:

56 బంతుల్లోనే సెంచరీ:

వివ్‌ రిచర్డ్స్‌ వెస్టిండీస్ తరఫున 121 టెస్టుల్లో 50.23 సగటుతో 8540 పరుగులు చేసాడు. అందులో 24 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అత్యధిక స్కోరు 291 పరుగులు. 56 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి టెస్ట్ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక 187 వన్డేల్లో 6721 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు సాధించాడు. 1991లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.

టీమిండియా కోచ్‌ ఎంపిక.. కపిల్‌ కమిటీదే తుది నిర్ణయం

క్లీన్‌స్వీప్‌పై కన్ను:

క్లీన్‌స్వీప్‌పై కన్ను:

ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. రెండు వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ నెగ్గి ఊపు మీదున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. కనీసం చివరి టీ20లో అయినా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్‌ ఆశిస్తోంది. ఈ రోజు రాత్రి గయానాలో మూడో టీ20 జరగనుంది. ఈ సిరీస్‌ అనంతరం విండీస్ గడ్డపై టీమిండియా మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here