ట్విట్టర్‌లో ఐసీసీ ప్రశంస: పెళ్లి రోజున ఓ పాకిస్థానీ జంట ఏం చేసిందో తెలుసా?

0
2


హైదరాబాద్: ఉపఖండంలో క్రికెట్‌ను ఎంతగా అభిమానిస్తారో మనందరికీ తెలిసిందే. పెళ్లికి వచ్చే అతిథులు మ్యాచ్‌ని మిస్సవకుండా వారి కోసం ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసిన సంఘటనను మనం గతంలో చూశాం. అయితే, తన పెళ్లి రోజే ఆస్ట్రేలియా-పాకిస్థాన్ టీ20 మ్యాచ్ ఉండటంతో ఓ పాక్ అభిమాని ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

పాకిస్థాన్ జట్టుకు వీరాభిమాని అయిన హసన్ తస్లీన్… పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 జరిగిన రోజునే వివాహం చేసుకున్నాడు. పెళ్లి రోజున పెళ్లి కుమారుడు ఎంత బిజీగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. అంతటి బిజీ రోజున కూడా హసన్ తస్లీన్ ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించడం మాత్రం మానుకోలేదు.

ఎత్తు ఎంత పనిచేసింది!: లక్నోలో క్రికెట్ అభిమానికి చేదు అనుభవం

వివరాల్లోకి వెళితే...

వివరాల్లోకి వెళితే…

అమెరికాలోని డెట్రాయిట్ మిచిగాన్‌లో నివసిస్తున్న హసన్ తస్లీమ్‌ పాకిస్థాన్ సంతతికి చెందిన వ్యక్తి. పాకిస్థాన్ జట్టుకు వీరాభిమాని. తన వివాహ అనంతరం ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్‌ని కొత్త జంట అమెరికాలో ఎలా టీవీలో వీక్షించిందో… పాకిస్తాన్ జట్టుపై తన ప్రేమను సోషల్ మీడియా పోస్టుతో పంచుకున్నాడు.

హసన్ తస్లీమ్‌ తన పోస్టులో

హసన్ తస్లీమ్‌ తన పోస్టులో

హసన్ తస్లీమ్‌ తన పోస్టులో “డైహార్డ్ క్రికెట్ అభిమానిగా, గత వారాంతంలో నా పెళ్లి నుంచి ఒక ఫోటోను సమర్పించాలనుకుంటున్నాను. సాంప్రదాయం ప్రకారం, పెళ్లి పూర్తైన తరువాత, వధువును కుటుంబంలో వేడుక కోసం ఇంటికి తీసుకొస్తారు. మేము ఇంటికి వచ్చేసరికి (అమెరికాలోని మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో అర్ధరాత్రి) పాక్ vs ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఉత్తర అమెరికాలో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న నేను పాకిస్తాన్ మ్యాచ్‌ని వీక్షించడానికి ఎంతో కష్టపడ్డాను. ఈరోజు నా పెళ్లి రాత్రి అయినప్పటికీ, నేను ఈ గేమ్‌ను కోల్పోను” అంటూ పేర్కొన్నాడు.

ఐసీసీ ట్విట్టర్‌లో సైతం

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సైతం తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఐసీసీ పోస్టు చేసిన ఈ ట్వీట్‌ను ఏడొందలకు పైగా నెటిజన్లు రీట్వీట్ చేయగా… ఆరువేలకు పైగా నెటిజన్లు లైక్ చేయడం విశేషం.

రెండో టీ20లో పాక్ ఓటమి

రెండో టీ20లో పాక్ ఓటమి

స్మిత్ (80 నాటౌట్; 51 బంతుల్లో 11 పోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. పెర్త్‌ వేదికగా శుక్రవారం మూడో టీ20 జరగనుంది. గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20కి వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here