ఠాణాలను తనిఖీ చేసిన సీపీ కార్తికేయ

0
2


ఠాణాలను తనిఖీ చేసిన సీపీ కార్తికేయ


బాల్కొండ ఠాణా ఆవరణలో పరిశీలిస్తున్న సీపీ

బాల్కొండ, న్యూస్‌టుడే: బాల్కొండ, మెండోరా ఠాణాలను నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ గురువారం తనిఖీ చేశారు. దూద్‌గాం సమీపంలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సందర్శించారు. అనంతరం మెండోరా పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. బాల్కొండలో కొత్తగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని పరిశీలించారు. భవనంలో లీకేజీలు జరుగుతుండడంతో మరమ్మతులు చేయించుకోవాలని చెప్పారు. పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. వెంట ఆర్మూర్‌ ఏసీపీ రాములు, ఆర్మూర్‌ గ్రామీణం సీఐ విజయ్‌కుమార్‌, బాల్కొండ, మెండోరా ఎస్సైలు శ్రీహరి, కృష్ణమూర్తి ఉన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/139193.html



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here