డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేషనల్‌ అవార్డుకు ఫిరంగి రాజేశ్వర్‌

0
1



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేషనల్‌ అవార్డు – 2019 సంవత్సరానికి అంబరిపేట్‌ ఎంపిటిసి ఫిరంగి రాజేశ్వర్‌ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు. అవార్డు సెలక్షన్‌ కమిటీ నేషనల్‌ ఛైర్మన్‌, బిఎస్‌ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేసినట్టు రాజేశ్వర్‌ తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమి ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు అవార్డు అందజేయనున్నట్టు తెలిపారు. ఈనెల 29న ముంబయిలో జరిగే కాన్ఫరెన్సులో రాజేశ్వర్‌ అవార్డు అందుకోనున్నట్టు పేర్కొన్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు కాన్పరెన్సులో పాల్గొంటారన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here