డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలి

0
0


డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలి

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి), న్యూస్‌టుడే: డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ముట్టడించారు. డిగ్రీ విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని జిల్లా కో కన్వీనర్‌ నవీన్‌కుమార్‌ డిమాండు చేశారు. విషయాన్ని వీసీ, రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్‌ చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి అనిల్‌, వర్సిటీ అధ్యక్షుడు రాజు, నాయకులు రవి పాల్గొన్నారు.

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివి పరిధిలోని డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించి, డిటెన్షన్‌ విధానం ఎత్తివేయాలని పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్‌కు ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌ సంఘాల నాయకులు శుక్రవారం విన్నవించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here