డిజిటల్ బ్యాంకింగ్ యాప్: UKలో SBI యోనో

0
2


డిజిటల్ బ్యాంకింగ్ యాప్: UKలో SBI యోనో

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డిజిటల్ బ్యాంకింగ్ యాప్ యోనోను యూకే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. యూకే ఇండియా బిజినెస్ కౌన్సెల్ (UKIBC) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ దీనిని లాంచ్ చేశారు. భారత్‌లో ఈ యాప్‌ విజయవంతమైందని, ఇప్పుడు యూకే కస్టమర్ల కోసం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పారు. ఎస్బీఐ టెక్నలాజికల్ సామర్థ్యాలకు ఇది నిదర్శనమన్నారు.

సులభంగా యూకే మనీ ట్రాన్సుఫర్ లేదా పేమెంట్స్, భారత్‌లో చెల్లింపులు వంటివి 24×7 వంటివి YONO SBI UK కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ ద్వారా ఆన్ లైన్ లో ఖాతాను ప్రారంభించే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది.

ఈ సందర్భంగా రజనీష్ కుమార్ మాట్లాడుతూ… ఎస్బీఐ సాంకేతిక సామర్థ్యాలలో YONO SBI UK ఒకటి అన్నారు. దీనిని యూకే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ యాప్ అందరికు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. ఇందులోని ఫ్యూచర్స్ ఉపయోగించేందుకు చాలా సులువుగా ఉంటాయన్నారు. ఇది యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంటుందన్నారు.

ఇది వినియోగదారులకు బ్యాంకింగ్ అవసరాలు తీర్చేందుకు సరళంగా ఉంటుందన్నారు. అలాగే వినియోగదారులకు ప్రెండ్లీగా ఉంటుందన్నారు. ఈ యాప్ ఎస్బీఐ యూకే, ఎస్బీఐ ఇండియా రెండింటిని యాక్సెస్ చేసుకోవచ్చునని చెప్పారు. తద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగు పరుస్తుందన్నారు. సులభంగా ఉపయోగించవచ్చునన్నారు.

ఈ యాప్ ద్వారా ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్‌లను ఆన్ లైన్ ద్వారా మార్చుకోవచ్చునని చెప్పారు. కస్టమర్ల ఫండ్స్‌ను సురక్షితంగా ఉంచేందుకు యోనో ఎస్బీఐ యూకే యాప్ డివైస్ బైండింగ్ కార్డాన్‌తో ఉంటుందన్నారు.

యూకే ఇండియా బిజినెస్ కౌన్సెల్ గ్రూప్ సీఈవో రిచర్డ్ హీల్డ్ మాట్లాడుతూ… ఎస్బీఐ తన కస్టమర్ కోసం వినూత్న సాంకేతిక ఉత్పత్తులను అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందని, యూకేలో భారతీయులు కూడా ఎక్కువ మంది ఉన్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు. ఎక్కువ ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగులు కలిగి ఉన్న బ్యాంకు. దేశంలో అతిపెద్ద రుణదాత కూడా. జూన్ 30, 2019 నాటికి బ్యాంకు డిపాజిట్ బేస్ రూ.28 లక్షల కోట్లుగా ఉంది. కాసా రేషియో 45.1 శాతం ఉంది. రూ.19 లక్షల కోట్ల అడ్వాన్సులు.

గృహ రుణాలు, ఆటో లోన్లలో మార్కెట్ వాటాలో వరుసగా 35 శాతం, 36 శాతంగా కలిగి ఉన్నాయి. భారత్‌లో ఈ బ్యాంకుకు 22,088 బ్రాంచీలు ఉన్నాయి. ఏటీఎం లేదా సీడీఎం నెట్ వర్క్ 58,495కు పైగా ఉన్నాయి. 66 మిలియన్ల మందికి పైగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కలిగి ఉన్నారు. 14.8 మిలియన్లకు పైగా మొబైల్ బ్యాంకింగ్ సేవలు కలిగి ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here