డిసిసి ఉపాధ్యక్షులుగా అబ్దుల్‌ నాయీమ్‌

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ నయీమ్‌ పలు సామాజిక కార్యక్రమాలు చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి అనేక రకాలుగా సేవలందిస్తు, పార్టీని బలపరుస్తూ చైతన్య పరిచారు. ప్రజలకు ఉపయోగపడి ప్రయోజనాలను ప్రతి బడుగు బలహీన వర్గాలకు లబ్ధి పొందే విధంగా అనేక సేవలు అందించారు. తెరాస ప్రభుత్వంలో సామాజిక దక్పథంతో సేవలు అందించినా పార్టీ గుర్తించకపోవడంతో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు అబ్దుల్‌ సోహెల్‌ చేతుల మీదుగా నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులుగా కాంగ్రెస్‌ పార్టీ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నయీమ్‌ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అందించిన రాష్ట్ర అధ్యక్షులకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీకి మరింత సేవలు అందించేందుకు బాధ్యతాయుతంగా పదవిని అందించిన రాష్ట్ర అధ్యక్షులతో పాటు జిల్లా నాయకులకు ప్రజానీకానికి రుణపడి ఉన్నానని అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా చట్టపరంగా న్యాయం జరిగేంత వరకు ముందంజలో ఉంటానని ఆయన తెలిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారి అవసరాల నిమిత్తం రాజకీయ నాయకులను కీలు బొమ్మలుగా వాడుకొని వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here