డిసెంబరు 1న బిసి యువజన రాష్ట్ర మహాసభ

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ ఒకటిన హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బిసి యువజన సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం మహాసభ కరపత్రాలను నిజామాబాద్‌ వంశీ ఇంటర్నేషనల్‌ హోటల్లో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్‌ నంద, బిసి సంక్షేమ సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్ష నరాల సుధాకర్‌ విడుదల చేశారు. బీసీ యువత తమను తాము పరిపాలించు కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాతలు జండాలు మోసారు, తండ్రులు జెండాలు మోశారు, ఇప్పటికైనా నేటి బీసీ యువత మోయడం ఆపేసి రాజ్యాధికారం వైపు పయనించాలని జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. కొన్ని సంవత్సరాల నుండి పోరాడుతున్నాగాని బీసీల హక్కులను సాధించుకోలేక పోయామంటే అందుకు కారణం రాజ్యాధికారంలో అగ్రకులాల ఆధిపత్యం ఉండటమేనన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న డిమాండ్లు బీసీ క్రీమీలేయర్ను ఎత్తివేయడం, ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం, బీసీ ప్లాన్‌ డిమాండ్లను ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేనందున, మనమే ప్రభుత్వం వైపు అడుగేసి మన తలరాతలను మనం మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్‌ నంద మాట్లాడుతూ యువత అనుకుంటే సాధించలేనిది ఏమీ లేనేలేదన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here