డిసెంబర్‌లో టీపీఎల్ 2వ సీజన్: హైదరాబాద్‌లో టాలెంట్ హంట్!

0
2


హైదరాబాద్: టెన్నిస్‌కు పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని దేశంలోని యువ ప్రతిభను వెలికి తీసేందుకు గాను టెన్నిస్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) రెండో సీజన్‌ను శుక్రవారం ప్రకటించారు. డిసెంబర్ 12 నుంచి 15 వరకు జరగనున్న ఈ టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌కు ముంబై అంథేరీలోని స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమిస్తోంది.

‘సెంచరీ బాదిన స్మిత్‌ను ఎగతాళి చేయడం నిరాశకు గురిచేసింది’

మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో దేశ వ్యాప్తంగా 88 మంది టెన్నిస్ ప్లేయర్లు టైటిల్ కోసం పోటీ పడనున్నారు. ఈ లీగ్‌లో పాల్గొనే ముంబై జట్టు ఫ్రాంచైజీని భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ సొంతం చేసుకున్నారు. ఇక, బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే సైతం ఓ ఫ్రాంచైజీకి యజమానిగా ఉన్నారు.

2nd Edition of Tennis Premier League to be held in December

టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే ఎనిమిది జట్లలో పురుష ప్లేయర్ల(అండర్-14)తో పాటు మహిళా ప్లేయర్లు(అండర్-18) కూడా పాల్గొననున్నారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు గాను అండర్-18 విభాగంలో గర్ల్స్‌ను, అండర్-14 విభాగంలో అబ్బాయిలను ఎంపిక చేయనున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌: రోహిత్‌ లేకుండా టీమిండియా ఫొటో.. అభిమానుల ఆగ్రహం

ఇందు కోసం దేశంలోని నాలుగు సిటీల్లో టాలెంట్ హంట్స్‌ను నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, ముంబై నగరాల్లో టాలెంట్ హంట్స్‌ను అక్టోబర్ 20 నుంచి 23 మధ్యలో నిర్వహిస్తుండగా… హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో నవంబర్ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు.

2nd Edition of Tennis Premier League to be held in December

టాలెంట్ హంట్స్ కోసం ముందుగా ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 5 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని టెన్నిస్ ప్రీమియర్ లీగ్ నిర్వాహాకులు సూచించారు. మాజీ ప్లేయర్ కునాల్ థాకుర్ ప్రతిష్టాత్మంకగా తీసుకొచ్చిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ పెద్ద సక్సెస్ అయింది.

యాషెస్‌ సిరీస్.. విరాట్ కోహ్లీని అధిగమించిన స్టీవ్‌ స్మిత్‌

ఈ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సక్సెస్ అవడంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, జాతీయ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ ముఖ్య భూమిక పోషించారు. ఈ లీగ్ విజేతకు రూ.60 లక్షలు ప్రైజ్ మనీని ఇవ్వనున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here