డీఆర్ఎస్ అంచనా వేయడంలో విఫలం: రిషబ్ పంత్‌ను వెనుకేసుకొచ్చిన రోహిత్

0
1


హైదరాబాద్: రిషబ్ పంత్ చిన్నవాడని… డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)ను అర్ధం చేసుకోవడానికి అతడికి ఇంకా సమయం అవసరమని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ డీఆర్ఎస్‌ను అంచనా వేయడంలో విఫలమైన సంగతి తెలిసిందే.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో చాహల్‌ వేసిన 10వ ఓవర్‌లో సౌమ్యసర్కార్‌(20) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో ఓ బంతి సౌమ్య సర్కార్ బ్యాట్‌కు తాకకుండానే వెళ్లి నేరుగా వికెట్ కీపర్ పంత్‌ చేతుల్లో పడింది. దీంతో బ్యాట్స్‌మన్‌ ఔటయ్యాడని భావించిన పంత్‌.. అంపైర్‌ ఔటివ్వకపోయినా రోహిత్‌శర్మను ఒప్పించి డీఆర్‌ఎస్‌ కోరాడు.

వైరల్ వీడియో: డీఆర్‌ఎస్‌లో పంత్ విఫలం.. తలకొట్టుకున్న రోహిత్!!

టీమిండియా రివ్యూ వృథా

టీమిండియా రివ్యూ వృథా

రివ్యూలో సౌమ్యసర్కార్‌ బ్యాట్‌కు బంతి తగలలేదని స్పష్టంగా తేలడంతో టీమిండియా రివ్యూ వృథా అయింది. పంత్ అంచనా తప్పవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం చేసేదేమీ లేక నవ్వుకున్నాడు. డీఆర్ఎస్‌పై పంత్ అవగాహన లేకుండా ఒక రివ్యూని అనవసరంగా వృథా చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ

దీనిపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ “వాస్తవానికి, పంత్ యువ క్రికెటర్, డీఆర్‌ఎస్‌ను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం అవసరం. త్వరలోనే అతడు సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. కెప్టెన్ సరైన్ నిర్ణయం తీసుకోలేనప్పుడు బౌలర్లు కూడా సాయపడతారు” అని పంత్‌ను సమర్థించాడు.

బౌలర్‌ను లేదా వికెట్ కీపర్‌ని విశ్వసించాలి

బౌలర్‌ను లేదా వికెట్ కీపర్‌ని విశ్వసించాలి

“మీరు సరైన స్థితిలో లేనప్పుడు (ఫీల్డర్‌గా), మీరు మీ బౌలర్‌ను లేదా వికెట్ కీపర్‌ని విశ్వసించాలి. ఏ ఫార్మాట్‌లో ఆడినప్పటికీ… దాని ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలి” అని రోహిత్ శర్మ అన్నాడు. కాగా, తొలి టీ20లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

నవంబర్ 7న రాజ్ కోట్ వేదికగా రెండో టీ20

నవంబర్ 7న రాజ్ కోట్ వేదికగా రెండో టీ20

టీమిండియాతో ఇంతకముందు జరిగిన 8 టీ20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌కు టీ20ల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. అంతేకాదు ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 సిరిస్ ఇదే కావడం విశేషం. తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్‌‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 7న రాజ్ కోట్ వేదికగా జరగనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here