డూడుల్ గీయండి.. రూ.5లక్షలు గెలవండి.. చిన్నారులకు గూగుల్ బంపర్ ఆఫర్

0
1


డూడుల్ గీయండి.. రూ.5లక్షలు గెలవండి.. చిన్నారులకు గూగుల్ బంపర్ ఆఫర్

  చిన్నారులకు గూగుల్ బంపర్ ఆఫర్ || Google Announces Doodle Contest For Children’s Day || Oneindia

  గూగుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే లోగోపై డూడుల్ కనిపిస్తుంది. ఆ రోజుకున్న ప్రాముఖ్యతను వివరించేలా చిన్న కార్టూన్ రూపంలో అది దర్శనమిస్తుంది. అయితే ఈ డూడుల్ విషయంలో చిన్నారులకు గూగుల్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. చక్కగా బొమ్మలు వేసే స్టూడెంట్స్ గీసే చిత్రాన్ని డూడుల్‌గా వినియోగించనుంది. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే‌ను పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన డూడుల్‌ను డిస్ ప్లే చేయాలనుకుంటోంది. ఇందుకోసం ఆసక్తిగల పిల్లలు వివిధ రకాల డూడుల్ వేసి పంపాలని కోరుతోంది. చిన్నారులు వేసే ఆ డూడుల్ గూగుల్‌లో డిస్ ప్లే అవడమే కాదు.. ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా తీసుకురానుంది.

  భవిష్యత్తు గురించి ఆలోచనలు

  భవిష్యత్తు గురించి ఆలోచనలు

  నేను పెద్దయ్యసరికి ఏం ఆశిస్తున్నానంటే (WHEN I GROW UP, I HOPE)అనే అంశంపై డూడుల్ వేయాల్సి ఉంటుంది. ఈ టాపిక్ ఆధారంగా చిన్నారులు తమ ఆలోచనలకు రూపం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ బొమ్మలో ‘GOOGLE’అనే స్పెల్లింగ్ తప్పకుండా కనిపించాలన్నది నిబంధన. 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులెవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. డూడుల్ కోసం క్రేయన్స్, క్లే, గ్రాఫిక్ డిజైన్‌లు ఇతర మెటీరియల్‌ను వాడవచ్చు. చిన్నారులు సెప్టెంబర్ 30లోపు తమ డూడుల్స్‌ను పంపాల్సి ఉంటుంది.

  ఎలా దరఖాస్తు చేయాలంటే

  ఎలా దరఖాస్తు చేయాలంటే

  గూగుల్ నుంచి ఎంట్రీ ఫాం డౌన్‌చేసుకుని దాన్ని నింపాలి. దానికి మీ డూడుల్‌ను జత చేయడంతో పాటు ఆ చిత్రానికి సంబంధించి కొంత వివరణ ఇచ్చి సబ్మిట్ చేయాలి. దరఖాస్తులు గూగుల్ వెబ్ సైట్‌లో .Jpg లేదా .Png రూపంలో అప్ లోడ్ చేయాలి. దరఖాస్తులను కొరియర్ ద్వారా కూడా పంపే అవకాశం కూడా కల్పించింది గూగుల్.

  పబ్లిక్ ఓటింగ్ పెట్టి నిర్ణయం

  పబ్లిక్ ఓటింగ్ పెట్టి నిర్ణయం

  చిన్నారులు గీసి పంపిన చిత్రాలన్నింటినీ గూగుల్ టీం పరిశీలిస్తుంది. అందులోంచి 20 చిత్రాలను ఎంపిక చేస్తుంది. అద్భుతమైన డూడుల్స్ తయారుచేసే నేహా, యూట్యూబర్ ప్రజక్త కోళి, పిల్లులు ఎంతో ఇష్టపడే ఛోటా బీమ్ బొమ్మ గీసిన రాజీవ్ చికాల సెలక్షన్ టీంలో ఉన్నారు. వీరంతా కలిసి ఎంపిక చేసిన20 బొమ్మలను అక్టోబర్ 21 నుంచి నవంబర్ 6 వరకు పబ్లిక్ ఓటింగ్‌లో పెడతారు. ఎవరి బొమ్మకైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారికి 5 లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌తో పాటు రూ.2లక్షల విలువైన టెక్నాలజీ ప్యాకేజీని స్కూల్‌కు అందించనున్నారు.  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here