డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

0
3



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నివాస ప్రాంతాలు, కార్యాలయాల్లో డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో ప్రజలకు, ఉద్యోగులకు సూచించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో గల పూల కుండీలను పరిశీలించి వాటిలో నీరు నిల్వ ఉంటే తొలగించారు. డ్రైనేజీలో దోమలు నివారణకు సంబంధించిన మందును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లోనూ, ఇళ్లలోనూ, ఇంటి పరిసరాలలోను పూల కుండీలు, పాత డబ్బాలు, పాత బకెట్లు, కొబ్బరి చిప్పలు తదితర వాటిల్లో నీరు నిలువ ఉంటే వెంటనే ఖాళీ చేయాలన్నారు. గుంతలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. తద్వారా డెంగ్యూకు సంబంధించిన దోమలు ఆ ప్రాంతాల్లో విస్తరించకుండా చేసినట్లవుతుందని, డెంగ్యూ వ్యాధి ఆ ప్రాంత ప్రజలకు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అవుతుందని ఆయన జిల్లా ప్రజలకు, కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులకు సూచించారు. చాలా ప్రాంతాల్లో జిల్లాల్లో డెంగ్యూ వ్యాధి విస్తరిస్తున్నందున ప్రజలు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అనారోగ్య సమస్యలు ఏర్పడితే వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here