డైరీ మిల్క్ కవర్లపై అక్షరాలు మాయం.. గుండె బరువెక్కించే కారణం!

0
4


డైరీ మిల్క్ చాక్లె్ట్ కవర్ మీద అక్షరాలు కనిపించకపోతే.. అదేదో ప్రింటింగ్ లోపం అని అనుకోవద్దు. కావాలనే ఆ సంస్థ చాక్లెట్ కవర్ మీద అక్షరాలను తొలగించింది. నీలం రంగు కవర్ మీద రెండు గ్లాసుల నుంచి పాలు కిందికి జారుతున్నట్లుగా ఉండే బొమ్మ మాత్రమే కనిపించేలా డైరీ మిల్క్ సంస్థ ఈ చాక్లెట్లను సిద్ధం చేసింది.

ఈ చాక్లెట్లను చూసిన చాలామంది వినియోగదారులు అది ముద్రణ లోపం అని భావించారు. దాని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చాక్లెట్లను ప్రయోగాత్మకంగా యూకేలో అందుబాటులోకి తెచ్చారు. ఆ దేశంలో నివసిస్తున్న 2.25 లక్షల మంది నిరాశ్రయ వృద్ధులను ఆదుకోవడం కోసం తమ బ్రాండ్ అక్షరాలను విరాళంగా అందిస్తూ.. ఈ చాక్లెట్లను అందుబాటులోకి తెచ్చింది.

Read also: కన్నీళ్లు ఆగడం లేదు, చేతుల్లేని ఆ చిన్నారిని చూసి.. ఆనంద్ మహీంద్ర భావోద్వేగం

ఈ చాక్లెట్లు కొనుగోలు చేసేవారు పరోక్షంగా ఆ వృద్ధులకు సాయం చేసినట్లేనని సంస్థ వెల్లడించింది. వారు ఆ చాక్లెట్‌కు చెల్లించే మొత్తంలో కొంత వృద్ధుల చారిటీకి అందుతుందని పేర్కొంది. అంతేగాక, ఆ చాక్లెట్లు కొనుగోలు చేసే వ్యక్తులు వృద్ధులను కలిసి, వారికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపింది.

బ్రాండ్ మేనేజర్ లౌరా గ్రే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వృద్ధులను ఆదుకోవడం కోసం మేం ‘ఏజ్ యూకే’ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. సొంత వ్యక్తులు లేక, ఒంటరి జీవితాలను గడిపే వృద్ధుల్లో సంతోషం నింపడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. అందుకే, మా సంస్థ ఆ చాక్లెట్‌ కవర్‌పై ఉండే అక్షరాలను వారికి విరాళంగా అందిస్తున్నాం’’ అని తెలిపారు.

Read also: కూల్ డ్రింక్సే అతడి ఆహారం.. చివరికి చెయ్యి కుళ్లిపోయి ఆస్పత్రిపాలు!

యూకేలో లక్షలాది మంది వృద్ధులు ఒంటరి జీవితాలను గడుపుతున్నారు. కనీసం పలకరించేవాళ్లు లేక దుర్భర జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. వయస్సు మీద పడటం వల్ల సొంత పనులు చేసుకోలేక బాధపడుతున్నారు. కొందరైతే ఆహారం లేక, వ్యాధులు వచ్చినప్పుడు బాగోగులు చూసేవాళ్లు లేక అనాథల్లా మరిచిపోతున్నారు. అలాంటి వృద్ధులను గుర్తించి, ఆర్థిక సాయంతోపాటు వారికి ‘మేమున్నాం’ అని భరోసా ఇచ్చేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ కింద ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ సమస్య కేవలం యూకేలోనే కాదు, ఇండియాలో మరింత దారుణంగా ఉంది. మరి, డైరీ మిల్క్ ఈ సేవలను ఇండియాలోనూ అమలు చేస్తుందా, లేదా అనేది తెలియాల్సి ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here