డ్రగ్స్ పోగొట్టుకున్నారా.. మమ్మల్ని కలవండి.. రాజస్థాన్ పోలీసుల వింత ట్వీట్..!

0
2


డ్రగ్స్ పోగొట్టుకున్నారా.. మమ్మల్ని కలవండి.. రాజస్థాన్ పోలీసుల వింత ట్వీట్..!

జైపూర్ : రాజస్థాన్ పోలీసుల వింత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోదాల్లో దొరికిన హెరాయిన్‌పై వారు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. దాంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరైనా హెరాయిన్ పోగొట్టుకున్నారా.. అయితే డోంట్ వర్రీ.. అది మా దగ్గర పదిలంగా ఉంది.. దాన్ని మీ సొంతం చేసుకోవాలంటే మమ్మల్ని కలవండి అంటూ ట్వీట్ చేశారు. ఒకవేళ మీరు రానిపక్షంలో అది మీకు ఎప్పటికీ దక్కదు అని పేర్కొన్నారు. హెరాయిన్ పోగొట్టుకున్నవారు తమ దగ్గరకొస్తే ఫుడ్డు, బెడ్డు అన్నీ ఫ్రీగా సమకూరుస్తామంటూ వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. ఈ ట్వీట్ కాస్తా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

రాజస్తాన్‌లోని ఓ గోదాములో భారీగా హెరాయిన్‌ ఉందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. దాంతో అక్కడున్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో బస్తాలకొద్దీ దొరికిన హెరాయిన్‌‌ను ఫొటోలు తీసి ఇలా ట్వీట్‌ చేశారన్నమాట.

రాజస్థాన్ పోలీసుల ట్వీట్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అసోం పోలీసులను కాపీ కొట్టారుగా అని కొందరంటే.. ముంబై పోలీసులను మించిపోతున్నారుగా అంటూ మరికొందరు కామెంటారు. ఇంకొందరేమో స్మగ్లర్లను పట్టుకోకుండా ఇదేమీ పోస్టు నాయనా అంటూ తలంటారు. ఇదివరకు అసోం పోలీసులు ఇలాంటి పోస్టు ఒకటి పెట్టడంతో బాగా వైరల్ అయింది. 590 కేజీల గంజాయి పట్టుబడటంతో.. పోయినవారు బాధపడకండి.. అది మా దగ్గరే ఉంది.. ఆ సరుకు మీదైతే దుబ్రి పోలీస్ స్టేషన్‌లో కలవండి అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆ క్రమంలో ఇప్పుడు రాజస్థాన్ పోలీసులు పెట్టిన వ్యంగ్యాస్త్ర ట్వీట్ ఓ రకంగా నవ్వులు పూయిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here