ఢిల్లీతో జతకట్టిన సన్నీ లియోన్: ఆమె అందం స్టేడియానికి ప్రేక్షకులను తీసుకొస్తుందా?

0
2


దుబాయ్: టీ10 లీగ్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ బుల్స్‌ జట్టుకు బాలీవుడ్ హాట్ నటి ‘సన్నీ లియోన్’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయింది. దుబాయ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ బుల్స్‌ తన కొత్త జెర్సీ, కొత్త గీతాన్ని ఆవిష్కరించింది. అదేవిధంగా సన్నీ లియోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నట్టు జట్టు సహ యజమాని రిజ్వాన్‌ సాజన్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సన్నీ లియోన్ సందడి చేసింది.

India vs Bangladesh: తొలి టీ20.. ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు!!

బ్రాండ్ అంబాసిడర్‌గా సన్నీ:

బ్రాండ్ అంబాసిడర్‌గా సన్నీ:

ఇంతకుముందు ఈ టీ10 ఫ్రాంచైజీ బెంగాల్‌ టైగర్స్‌ పేరుతో ఉండేది. ఇప్పుడు డిల్లీ బుల్స్‌గా రీ బ్రాండ్‌ చేసుకుంది. పేరుతో పాటు కొత్త జెర్సీ, కొత్త గీతాన్ని కూడా ఆవిష్కరించింది. ఇక బ్రాండ్ అంబాసిడర్‌గా సన్నీని నియమించుకుంది. ఇంగ్లాండ్‌కు 2019 ప్రపంచకప్‌ అందించిన స్టార్ ప్లేయర్ ఇయాన్‌ మోర్గాన్‌ ఢిల్లీ బుల్స్‌ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. పాక్‌ సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ వైస్‌ కెప్టెన్‌.

 బుల్స్‌లో జహీర్‌ ఖాన్‌:

బుల్స్‌లో జహీర్‌ ఖాన్‌:

మోర్గాన్‌, మాలిక్‌లతో పాటు ఢిల్లీ బుల్స్‌ జట్టులో స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ, టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌, పాకిస్థాన్ యువ బౌలింగ్‌ సంచలనం మహ్మద్‌ హస్నైన్‌ బుల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్టార్ ఆటగాళ్లతో కూడిన బుల్స్‌ బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది.

సన్నీ మా జట్టుకు అందం:

సన్నీ మా జట్టుకు అందం:

బుల్స్‌ సహ యజమాని రిజ్వాన్‌ సాజన్‌ సన్నీ లియోన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. రిజ్వాన్‌ మాట్లాడుతూ… ‘జట్టును రీబ్రాండ్‌ చేసాం. కొత్త జెర్సీ, జట్టు నేపథ్య గీతాన్ని ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. బుల్స్‌ ప్రచారకర్తగా ధైర్యవంతురాలు, అందాల రాశి సన్నీ లియోన్‌ని ఆహ్వానిస్తున్నాం. సన్నీ మా జట్టుకు అందం. ఆమె భారీగా అభిమానులను స్టేడియాలకు తీసుకురాగలదు’ అని ధీమా వ్యక్తం చేశారు.

సన్నీ ఆనందం:

సన్నీ ఆనందం:

‘గొప్ప సారధి ఇయాన్‌ మోర్గాన్‌ మా కెప్టెన్. సీనియర్ ప్లేయర్ షోయబ్‌ మాలిక్‌ మా వైస్‌ కెప్టెన్‌. మాలిక్‌ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఉత్కంఠరేకెత్తించే సమయాల్లో అతడి ప్రశాంతత జట్టుకు మేలు చేస్తుంది. జట్టుకు నా శుభాకాంక్షలు’ అని సాజన్‌ అన్నారు. బుల్స్‌కు ప్రచారకర్తగా ఎంపికైనందుకు సన్నీ లియోన్‌ ఆనందం వ్యక్తం చేసింది. ‘మంచి అభిరుచి గల జట్టులో భాగం అయినందుకు సంతోషం. వ్యక్తిగతంగా ఈ జెర్సీ రంగు చాలా ఇష్టం. బుల్స్ జట్టుకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’ అని సన్నీ పేర్కొన్నారు.

నవంబర్ 14 నుండి లీగ్ ప్రారంభం:

నవంబర్ 14 నుండి లీగ్ ప్రారంభం:

టీ10 లీగ్ మూడో సీజన్ నవంబర్ 14 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. గత ఏడాది షార్జా క్రికెట్ స్టేడియంలో లీగ్ జరగగా.. ఈ సారి యుఏఈ రాజధాని అబుదాబిలో జరుగనుంది. టీ10 లీగ్‌లో యువరాజ్‌ సింగ్‌ మరఠా అరేబియన్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. షాహిద్‌ అఫ్రీది, థిసారా పెరీరా, నిరోషన్‌ డిక్‌వెల్లా, మొయిన్ అలీ, కీరన్ పోలార్డ్, ఆండ్రూ రసెల్‌ పలు జట్లకు ఆడుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here