ఢిల్లీలో ఎమర్జెన్సీని తలపిస్తోంది, వాతావరణం భయానకంగా ఉంది: ట్విట్టర్‌లో అశ్విన్

0
2


హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం భయానకంగా ఉందని టీమిండియా వెటరన్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కి ఢిల్లీ వాయు కాలుష్యం భయపెడుతోంది.

ఈ సీజన్‌లోనే చెత్త గాలి నాణ్యతను శుక్రవారం ఢిల్లీ నమోదు చేసింది. శనివారం ఉదయం నాటికి గాలి కాలుష్య స్థాయి మరింతగా పెరిగింది. అధికారిక డేటా ప్రకారం శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 427గా నమోదైంది. ఢిల్లీతో పోలిస్తే ఘజియాబాద్ (496), గ్రేటర్ నోయిడా (496), నోయిడా (499) పట్టణాల్లో కాలుష్య స్థాయిలు ఇంకా ఘోరంగా ఉన్నాయి.

కోహ్లీ, మన్రో రికార్డు బద్దలు: ఆసీస్ తరుపున టీ20ల్లో వార్నర్‌ సరికొత్త రికార్డు

ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్యంపై అశ్విన్ మాట్లాడుతూ “ఢిల్లీలో గాలి నాణ్యత నిజంగా భయానకంగా ఉంది. మనం తీసుకునే ఊపిరిలో ఆక్సిజన్‌ శాతం అవసరమైనంత ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి” అని ట్వీట్‌ చేశాడు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో అశ్విన్‌కు చోటు దక్కలేదు. అశ్విన్ దేవధర్ ట్రోఫీలో తమిళనాడుకు ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా ప్రస్తుతం అశ్విన్ రాంచీలో ఉన్నాడు. వాతావరణ కాలుష్యం కారణంగా తొలి టీ20లో ఇరు జట్ల క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడి ఏమైనా సమస్యలకు లోనైతే ఏమి చేయాలని డీడీసీఏ కలవరపడుతోంది.

మూడు రోజుల క్రితం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 357గా నమోదైంది. అయితే, శుక్రవారానికి గాలి నాణ్యత సూచిక 400 దాటింది. దీంతో ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. చివరి నిమిషంలో మ్యాచ్‌ను మరో వేదికకు మార్చాలనుకున్నపటికీ అది సాధ్యం కాకపోవడంతో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు ఇక్కడ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి.

Missing this little one: ధోని, జీవా త్రోబాక్ ఫోటోను పోస్ట్ చేసిన హార్దిక్ పాండ్యా

ఢిల్లీలో కాలుష్యం త‌గ్గేంత వ‌ర‌కు ఎటువంటి మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించరాదని టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ అన్న సంగతి తెలిసిందే. అయితే, షెడ్యూల్ ప్రకారమే తొలి టీ20 జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here