ఢిల్లీ మళ్లీ వస్తాడు.. `ఖైదీ` సీక్వెల్‌పై కార్తి హింట్‌

0
2


కోలీవుడ్‌ యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ఖైదీ. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఖైదీ తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఖైదీ సినిమా ఇప్పటికీ హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లు సాధిస్తు్న్న సందర్భంగా కార్తి అభిమానులకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు.
Also Read: క్రేజీ కాంబో: హీరోగా డైరెక్టర్‌.. విలన్‌గా హీరో

`ఖైదీ చిత్రం పట్ల మీరు చూపించే ప్రేమ, మీరు అందించిన ప్రశంసలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియ‌డం లేదు. ఒక ఎగ్జైటింగ్ స్టోరీని మీకు అందించాలనే లక్ష్యంతో నేను మా టీమ్ మనసు పెట్టి హార్డ్ వర్క్ చేశాం. కానీ మేము ఈ స్థాయిలో రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా చిత్రాన్ని చూసి అభినందించిన మహేష్ బాబు గారికి థాంక్స్. తన ప్రశంసలతో టీమ్ అంతా థ్రిల్ అయ్యారు. ఈ సినిమాని అభినందిస్తూ జనంలోకి తీసుకెళ్ళిన మీడియా వారికి ధన్యవాదాలు. ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు అభిమానులకి, ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి కోసం ఢిల్లీ మళ్ళీ వస్తాడు` అంటూ ట్వీట్ చేశాడు కార్తి.

Also Read: బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే ప్రొమో.. కలర్‌ఫుల్‌.. మెగాస్టార్‌ మిస్‌!

కార్తి చివరి సినిమా దేవ్‌ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే పాటలు, హీరోయిన్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకుండా ఖైదీ ఇంతటి ఘన విజయం సాధిస్తుందని ముందుగా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బిగిల్‌ లాంటి భారీ కమర్షియల్ సినిమాతో పోటి పడి కూడా కార్తి సూపర్‌ హిట్ సాధించటంతో అభిమానులు సంబరాలుచేసుకుంటున్నారు. ఈ సినిమాతో తెలుగులోనూ మరోసారి తన సత్తాచాటాడు కార్తి.
Also Read: మోదీ సెక్యూరిటీ మా ఫోన్లు లాగేసుకున్నారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here