‘తక్కువ ధరకే ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కుట్ర’

0
2


‘తక్కువ ధరకే ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కుట్ర’

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: కోట్లు విలువ చేసే ఆర్టీసీ ఆస్తులను తక్కువ ధరకు అమ్ముకునే ప్రయత్నంలో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఈ కుట్రలు చేస్తున్నారని ఎంపీ అర్వింద్‌ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్‌ నాయకులు ఆర్టీసీని రిటేయిల్‌గా అమ్ముకుంటే కేసీఆర్‌ మాత్రం తనవారికి టోకుగా అప్పగించే పనిలో ఉన్నారని ఆరోపించారు. మోటారు వాహనాల చట్టంలో ఎక్కడా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని లేదని చెప్పారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌, అగ్రవర్ణపేదలకు 10 శాతం రిజర్వేషన్‌ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్‌ను గద్దెదించే వరకు విశ్రాంతి తీసుకునేది లేదన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులతో పాటు సకల జనుల సమ్మె చేసే అవకాశం ఉందని చెప్పారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here