తపాలా శాఖ నిర్లక్ష్యం నిరుద్యోగికి శాపం

0
0


తపాలా శాఖ నిర్లక్ష్యం నిరుద్యోగికి శాపం


మౌఖిక పరీక్ష తర్వాత చేరిన కాల్‌ లెటర్‌

లింగంపేట, న్యూస్‌టుడే: తపాలా సిబ్బంది నిర్లక్ష్యానికి నల్లమడుగు పెద్దతండాకు చెందిన యువకుడు గోపాల్‌ ఉద్యోగ అవకాశం కోల్పోయాడు. ఇటీవల ఆయన ఎల్‌ఐసీలో ఏడీఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోన్నాడు. ఇందుకు సంబంధించిన మౌఖిక పరీక్ష ఈ నెల 1న ఉండగా కాల్‌ లెటర్‌ను శనివారం అందజేశారు. తపాలా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గతంలో సైతం తాను బాసర ట్రిపుల్‌ఐటీలో ఉద్యోగం కోల్పోయినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొర్పోల్‌ బీపీఎం స్థానంలో మరొకరు బినామీగా విధులు నిర్వహించడంతో ఈ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. సిబ్బంది కాకుండా ఇతర వ్యక్తులకు ఇచ్చి ఉత్తరాలను పంపిస్తున్నారన్నారు. ఉన్నత అధికారులు స్పందించి తపాలా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here